ETV Bharat / bharat

ఎయిర్​ఇండియా సీన్​ రిపీట్​.. తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన

author img

By

Published : Apr 24, 2023, 8:02 PM IST

Updated : Apr 24, 2023, 8:31 PM IST

మద్యం మత్తులో తోటి విమాన ప్రయాణికుడిపై మూత్రం పోశాడు ఓ వ్యక్తి. అమెరికా నుంచి దిల్లీ వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ఘటన అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

drunk-man-urinates-on-co-passenger-on-delhi-bound-flight
తోటి విమాన ప్రయాణికుడిపై మూత్రం పోసిన వ్యక్తి

విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్రం పోసిన ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. అమెరికన్​ ఎయిర్​ లైన్స్​కు చెందిన ఓ విమానంలో ఈ ఘటన జరిగింది. అమెరికా నుంచి దిల్లీ వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు.. మద్యం మత్తులో తోటి ప్రయాణికుడిపై మూత్రం పోసినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో విమానం దిల్లీ ఎయిర్​పోర్ట్​లో ల్యాండ్ అయిందని వారు వెల్లడించారు.

"ఓ భారతీయ ప్రయాణికుడు.. న్యూయార్క్​ నుంచి అమెరికా ఎయిర్​లైన్స్​కు చెందిన ఫ్లైట్​ నెం. AA 292 విమానంలో దిల్లీ వస్తున్నాడు. మద్యం మత్తులో అతడు తోటి ప్రయాణికుడిపై మూత్రం పోశాడు. విమానం దిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే సిబ్బంది.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్​కు సమాచారం అందించారు." అని ఎయిర్​పోర్ట్​ సెక్యూరిటీ అధికారి తెలిపారు. అనంతరం నిందితుడిని సెక్యూరిటీ ఫోర్స్​ అదుపులోకి తీసుకుని.. పోలీస్​ స్టేషన్​ తరలించాయని ఆయన వెల్లడించారు. నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై అమెరికా ఎయిర్​లైన్స్​ తమకు ఫిర్యాదు చేసిందని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్ డీసీపీ.. దేవేష్ కుమార్ మహ్లా తెలిపారు. నిందితుడిని దిల్లీకి చెందిన ఆర్య వోహ్రాగా గుర్తించామని ఆయన వెల్లడించారు. తోటి ప్రయాణికుడిపై నిందితుడు అసభ్యంగా ప్రవర్తించాడన్న డీసీపీ.. అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. బాధితుడి నుంచి ఇంకా ఎటువంటి ఫిర్యాదు అందలేదని అధికారులు తెలిపారు.

పక్కన కూర్చున్న వ్యక్తిపై మూత్ర విసర్జన..
నెల రోజుల క్రితం ఇదే అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌లో ఓ ప్రయాణికుడు పక్కనే కూర్చున్న వ్యక్తిపై మూత్ర విసర్జన చేశాడు. అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి ఈ ఘటనకు పాల్పడ్డాడు. విమాన సిబ్బంది విషయాన్ని వెంటనే.. పైలట్‌ ద్వారా దిల్లీ ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారు సీఐఎస్ఎఫ్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. విమానం ల్యాండ్‌ కాగానే నిందితుణ్ని సీఐఎస్ఎఫ్‌ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తప్పతాగి విమానంలో హల్​చల్.. వృద్ధురాలిపై మూత్రం పోసిన వ్యక్తి.. DGCA సీరియస్!..
అంతకుముందు ఎయిర్ఇండియా విమానంలో.. తోటి ప్రయాణికురాలైన వృద్ధురాలిపై ఓ ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెపై మూత్రం పోశాడు. న్యూయార్క్- దిల్లీ మధ్య ప్రయాణిస్తున్న ఫ్లైట్​లో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated :Apr 24, 2023, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.