ETV Bharat / bharat

ఏడాదిన్నర చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం!

author img

By

Published : Mar 26, 2022, 5:28 PM IST

Updated : Mar 26, 2022, 6:00 PM IST

Elderly man rapes toddler: ఆడుకుంటున్న ఏడాదిన్నర చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడో 60 ఏళ్ల వృద్ధుడు. ఈ దుశ్చర్య ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

elderly man rapes
అత్యాచారం

Elderly man rapes toddler: మద్యం మత్తులో 60 ఏళ్ల ఓ వృద్ధుడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. పొరుగింటిలో ఉండే ఏడాదిన్నర చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. తీవ్ర రక్తస్రావమైన బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

elderly man rapes
నిందితుడు

ఇదీ జరిగింది: శుక్రవారం ఉదయం బాలిక ఆడుకునేందుకు బయటకు వెళ్లింది. ఎంత సేపటికి తిరిగిరాకపోయే సరిగి కంగారు పడిన కుటుంబ సభ్యులు వెతకటం ప్రారంభించారు. చుట్టుపక్కల వెతుకుతూ.. సమీపంలోని నిందితుడి ఇంటికి వెళ్లారు. తలుపులు తీయాలని పిలిచినా పలకలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు గట్టిగా ప్రయత్నించే సరికి డోరు తెరిచిన వృద్ధుడు వారిని తోసేసి పారిపోయాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి చూడగా షాక్​కు గురయ్యారు. బాలిక రక్తపు మడుగులో మంచంపై పడి ఉంది.

వెంటనే పోలీసులకు సమాచారం అందించగా..సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొనఇ శుక్రవారం రాత్రి నిందితుడిని అరెస్ట్​ చేసినట్లు బరేలీ ఎస్​ఎస్​పీ రోహిత్​ సింగ్​ సంజ్వాన్​ తెలిపారు.

Last Updated : Mar 26, 2022, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.