ETV Bharat / bharat

స్మగ్లర్లపై 'పాన్-ఇండియా' దాడులు.. 100కేజీల బంగారం సీజ్.. విలువ ఎంతంటే?

author img

By

Published : Feb 21, 2023, 11:05 PM IST

dri-recovered-more-than-1-quintal-gold-from-patna-10-smuggler-arrested
సీజ్​ చేసిన బంగారం

రూ.51 కోట్ల విలువైన 100 కేజీల అక్రమ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇండో-నేపాల్ సరిహద్దులతో పాటు దేశ వ్యాప్తంగా దాడులు జరిపి.. అక్రమ బంగారాన్ని సీజ్​ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల అధ్యర్యంలో ఈ దాడులు జరిగాయి.

అక్రమార్కులపై అధికారులు విరుచుకుపడ్డారు. పాన్-ఇండియా స్థాయిలో చేసిన ఆపరేషన్​లో 100 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్​లో రూ.51 కోట్ల విలువైన బంగారాన్ని మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్​ చేశారు. ఇండో-నేపాల్​ సరిహద్దులతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో 'ఆపరేషన్ గోల్డెన్ డాన్' పేరుతో ఈ దాడులు జరిగాయి. ఘటనలో మొత్తం పది మందిని డీఆర్​ఐ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు భారతీయులు కాగా.. ఏడుగురు సుడాన్​ దేశస్థులు ఉన్నారు. మంగళవారం ఈ దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

పట్నా, పుణె, ముంబయిలలో తనిఖీలు జరిపిన తరువాత.. ఇండో-నేపాల్​ బార్డర్​లో దాడులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అనంతరం అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 1.35 కోట్లు విలువ చేసే దేశ, విదేశీ కరెన్సీని సైతం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

"స్వాధీనం చేసుకున్న బంగారం ఎక్కువగా పేస్ట్​ రూపంలో ఉంది. ఈ అక్రమ బంగారమంతా ఇండో-నేపాల్ సరిహద్దు గుండా బిహార్​ రాజధాని పట్నాకు తీసుకొచ్చారు. ఆపై రైళ్లు, విమానాల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు నిందితులు బంగారాన్ని తరలిస్తున్నారు. ఎక్కువగా ముంబయికి ఈ బంగారం అక్రమంగా రవాణా అవుతోంది" అని అధికారులు తెలిపారు.

dri-recovered-more-than-1-quintal-gold-from-patna-10-smuggler-arrested
సీజ్​ చేసిన బంగారం
dri-recovered-more-than-1-quintal-gold-from-patna-10-smuggler-arrested
సీజ్​ చేసిన బంగారం

ఆదివారం అర్థరాత్రి ముగ్గురు సూడాన్ దేశస్థులను.. పట్నా రైల్వే స్టేషన్‌లో ముంబయి రైలు ఎక్కుతున్న సమయంలో పట్టుకున్నట్లు డీఆర్​ఐ అధికారులు తెలిపారు. 'వీరి వద్ద 37.126 కిలోల బంగారం పేస్ట్​ లభ్యమైంది. రహస్యంగా దాచి ఉంచిన 40 పాకెట్లను సైతం ఇద్దరు సూడాన్​ దేశస్థుల నుంచి స్వాధీనం చేసుకున్నాం. వారు వేసుకున్న స్లీవ్‌లెస్ జాకెట్‌లలో బంగారాన్ని దాచిపెట్టారు. స్లీవ్‌లెస్ జాకెట్‌లను.. వారు ప్రత్యేకంగా తయారు చేశారు' అని అధికారి తెలిపారు.

dri-recovered-more-than-1-quintal-gold-from-patna-10-smuggler-arrested
సీజ్​ చేసిన బంగారం
dri-recovered-more-than-1-quintal-gold-from-patna-10-smuggler-arrested
సీజ్​ చేసిన బంగారం

'మూడో విదేశీయుడు సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణా కార్యకలాపాలను కోఆర్డీనేట్​ చేయడం, బంగారం అక్రమ రవాణాకు ఏర్పాట్లు చేయడం వంటివి చేస్తాడు. మరో ఇద్దరి మహిళ బృందాన్ని సోమవారం పుణెలో అరెస్ట్​ చేశారు. హైదరాబాద్ నుంచి ముంబయికి బస్​లో వెళుతుండగా వీరిని పట్టుకున్నారు. వీరి నుంచి 5.615 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం వివిధ రూపంలో ఉందన్నారు. వీటిని హ్యాండ్‌బ్యాగ్‌లలో దాచి ఉంచారు' అని సంబంధిత అధికారులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.