ETV Bharat / bharat

యూనివర్సిటీకి డ్రగ్స్​ సరఫరా.. మోడల్​ అరెస్ట్​

author img

By

Published : Jul 19, 2022, 9:02 AM IST

Shubham Malhotra Model: దిల్లీ యూనివర్సిటీకి డ్రగ్స్ సరఫరా చేస్తున్న మోడల్ శుభమ్ మల్హోత్రా, అతడి స్నేహితురాలు కీర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.కోటి విలువ చేసే డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు.

arrest
అరెస్టు

Shubham Malhotra Model: మోడల్‌ శుభమ్‌ మల్హోత్రా, అతడి మిత్రురాలు రూ.కోటి విలువచేసే మాదకద్రవ్యాలతో దిల్లీ పోలీసులకు పట్టుబడ్డారు. మోడల్‌ శుభమ్‌ మల్హోత్రా (25), అతడి మిత్రురాలు కీర్తి (27) హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి దిల్లీ యూనివర్సిటీలో విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. 'కొందరు దిల్లీ యూనివర్సిటీకి మాదకద్రవ్యాలు తీసుకొచ్చి అక్కడ విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించి, డగ్ర్‌ తరలిస్తున్న ఈ ఇరువురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం' అని క్రైం బ్రాంచ్‌ డిప్యూటీ కమిషనర్‌ రోహిత్‌ మీనా వెల్లడించారు.

శుభమ్‌, కీర్తి ఇద్దరు కలిసి హిమాచల్‌ ప్రదేశ్‌లో గంజాయి కొనుగోలు చేసి, అనంతరం కారులో తీసుకొచ్చి దిల్లీ యూనివర్సిటీలో విక్రయాలు జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. అయితే, కిర్తీ దిండు సాయంతో గర్భవతిగా నమ్మించి తనిఖీ అధికారులను బురిడీ కొట్టించేదని దర్యాప్తులో తేలింది. హిమాచల్‌ నుంచి గంజాయి తీసుకొస్తుండగా పక్కా సమాచారం అందుకొని.. వారి కారును వెంబడించి పట్టుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఆ ఇద్దరిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి: అరెస్టులపై స్టే విధించాలంటూ మరోసారి సుప్రీం మెట్లెక్కిన నుపుర్‌ శర్మ

భారీ సైబర్​ క్రైమ్.. బోనస్​ పేరుతో వల.. రూ.కోటి స్వాహా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.