ETV Bharat / bharat

దిల్లీలో పెరిగిన ఒమిక్రాన్​ కేసులు

author img

By

Published : Dec 14, 2021, 2:51 PM IST

Delhi omicron cases: దిల్లీలో మరో నలుగురు ఒమిక్రాన్​ బారినపడ్డారు. దీంతో దేశ రాజధానిలో కొత్త వేరియంట్​ సోకిన వారి సంఖ్య ఆరుకు చేరింది. ఒమిక్రాన్​ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అక్కడి ప్రభుత్వం తెలిపింది.

omicron cases in india
దిల్లీలో పెరిగిన ఒమిక్రాన్​ కేసులు.. దేశంపై కొత్త వేరియంట్​ పంజా?

Delhi omicron cases: దేశ రాజధాని దిల్లీలో మరో నాలుగు ఒమిక్రాన్​ కేసులు వెలుగుచూశాయి. వీరందరూ విదేశాల నుంచి వచ్చినవారేనని దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్​ వెల్లడించారు. పరిస్థితులు ప్రస్తుతం నియంత్రణలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.

"మొత్తం మీద ఇప్పటివరకు ఆరుగురికి ఒమిక్రాన్​ పాజిటివ్​గా తేలింది. వారిలో ఒకరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ కూడా అయ్యారు. వీరందరూ విదేశాలకు వెళ్లి వచ్చినవారే. ప్రస్తుతం మిగిలిన వారిని లోక్​నాయక్​ జైప్రకాశ్​ నారాయణ్​ ఆసుపత్రికి తరలించాము. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది."

--- సత్యేంద్ర జైన్​, దిల్లీ ఆరోగ్య మంత్రి.

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు జైన్​. ఇప్పటివరకు 74మందిని ఎయిర్​పోర్టు నుంచి ఆసుపత్రికి తరలించామని, అక్కడి స్పెషన్​ వార్డుల్లో ఒమిక్రాన్​ అనుమానితులకు చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు.

Omicron India tally: దిల్లీలో తాజాగా నమోదైన ఒమిక్రాన్​ కేసులతో.. దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్​ బారినపడిన వారి సంఖ్య 45కు చేరింది.

'బూస్టర్​ డోసుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు..'

ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో భారతీయులకు కరోనా టీకా బూస్టర్ డోసు అందించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే... దేశంలో కొవిడ్​ బూస్టర్​ డోసుల ఆవశ్యకతపై.. ఎన్​టీఏఐజీ(నేషనల్​ టెక్నికల్​ అడ్వైజరీ గ్రూప్​ ఆఫ్​ ఇమ్యునైజేషన్​)- ఎన్ఈజీవీఏసీ(నేషనల్​ ఎక్స్​పర్ట్​ గ్రూప్​ ఆన్​ వ్యాక్సిన్​ అడ్మినిస్ట్రేషన్​ ఫర్​ కొవిడ్​)​ శాస్త్రీయ ఆధారాలను సేకరిస్తున్నాయని దిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. కరోనా టీకా డోసుల షెడ్యూల్​పైనా చర్చలు జరుపుతున్నాయని.. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్​లో పేర్కొంది.

జాతీయ స్థాయిలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని ముందుకు నడిపించేందుకు ఎన్​టీఏజీఐ, ఎన్​ఈజీవీఏసీ విలువైన మార్గనిర్దేశాలను అందిస్తున్నట్టు కోర్టుకు వెల్లడించింది కేంద్రం. టీకా వేసుకుంటే శరీరంలో ఏర్పడే రోగనిరోధక శక్తి ఎంత కాలం ఉంటుందనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదని చెప్పిన కేంద్రం.. రోజులు గడుస్తున్న కొద్దీ మెరుగైన డేటా లభించే అవకాశముందని పేర్కొంది. సార్స్​-కొవ్​-2 వైరస్​ లక్షణాలపై ఇంకా పూర్తి సమాచారం లేదని, అలాంటప్పుడు.. బూస్టర్​ డోసు పంపిణీపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని స్పష్టం చేసింది. అర్హులైన వారందరికీ టీకా రెండు డోసులు పంపిణీ చేయడమే ప్రస్తుతం తమ లక్ష్యం అని.. బూస్టర్​ డోసుపై ఆయా సంస్థలు ఇంకా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదని తెలిపింది.

పాశ్చాత్య దేశాల్లో బూస్టర్​ డోసు పంపిణీ జోరందుకుంటున్న తరుణంలో.. భారత్​లో ప్రస్తుత పరిస్థితులను వివరించాలని కేంద్రాన్ని ఆదేశించింది దిల్లీ హైకోర్టు. కొవిడ్​కు బూస్టర్​ డోసు అవసరమా? అవసరమే అయితే.. ఎప్పటిలోగా బూస్టర్​ డోసులు అందుబాటులో ఉంటాయి? అన్న ప్రశ్నలకు సమాధానంగా అఫిడవిట్​ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో బూస్టర్​ డోసుల గురించి వివరించింది కేంద్రం.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.