Air India Ants: విమానంలో చీమల దండు- ఆలస్యంగా ప్రయాణం!

author img

By

Published : Sep 7, 2021, 8:23 AM IST

Air India News
ఎయిర్​ ఇండియా ()

విమాన ప్రయాణాల్లో అత్యంత ఖరీదైనది బిజినెస్​ క్లాస్​. ఇటువంటి దానిలో శుభ్రతకు పెద్ద పీట వేస్తాయి విమాన కంపెనీలు. అయితే దిల్లీ నుంచి లండన్​కు వెళ్లే ఎయిర్​ ఇండియా విమానంలో(Air India Ants) ఉన్నట్టుంది చీమలు దర్శనమిచ్చాయి.

విమానంలో అదీ అత్యంత ఖరీదైన బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణిస్తే ఎంతో పరిశుభ్రంగా, సౌకర్యంగా ఉంటుందని భావిస్తాం. కానీ అక్కడ చీమల దండు కనిపిస్తే.. ఆ కారణంగా విమానం మూడు గంటలు ఆలస్యంగా బయల్దేరితే ఎలా ఉంటుంది? తమకు ఇలాంటి అనుభవమే ఎదురైనట్లు ఎయిర్‌ ఇండియా (Air India Ants) విమాన ప్రయాణికులు కొందరు తెలిపారు.

దిల్లీ నుంచి లండన్‌కు వెళ్లే విమానం(Air India News) సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరాల్సి ఉండగా, టేకాఫ్‌ కావడానికి కాస్త ముందు బిజినెస్‌ క్లాస్‌లో చీమల బారు కనిపించిందని చెప్పారు. దీంతో మరో విమానాన్ని సిద్ధం చేసి అందులోకి ఎక్కించారని, ఈ తతంగం పూర్తయ్యేసరికి మూడు గంటలు పట్టిందని పేర్కొన్నారు.

ఆ విమానం సాయంత్రం 5.20 గంటలకు బయల్దేరింది. అయితే దీన్ని ఎయిర్‌ ఇండియా(Air India) ఖండించింది. విమానంలో చీమలు లేవని, టేకాఫ్‌ రద్దు కాలేదని సాయంత్రం ట్విట్టర్​లో పేర్కొంది.

ఇదీ చూడండి: వర్షాల కోసం బాలికలను నగ్నంగా ఊరేగించి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.