ETV Bharat / bharat

'ఇప్పుడు దిల్లీలో.. రేపు దేశమంతటా ఆర్డినెన్స్​'.. కేంద్రం​పై కేజ్రీవాల్ ఫైర్

author img

By

Published : Jun 11, 2023, 3:56 PM IST

Updated : Jun 11, 2023, 5:07 PM IST

Aap Maha Rally At Delhi : కేంద్ర ప్రభుత్వం దిల్లీలో తెచ్చిన ఆర్డినెన్స్​ను రాబోయే రోజుల్లో దేశం అంతటా తీసుకొస్తుందని ఆప్​ అధినేత దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆర్డినెన్స్​కు వ్యతిరేకంగా దిల్లీ ప్రభుత్వం​ చేపట్టిన ర్యాలీలో కేజ్రీవాల్ సహా, పంజాబ్​ సీఎం భగవత్​మాన్, పెద్ద ఎత్తున ఆప్​ కార్యకర్తలు పాల్గొన్నారు.

Delhi Ordinance
మహా ర్యాలీలో పాల్గొన్న అరవింద్ కేజ్రీవాల్

Aap Maha Rally At Delhi : దిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం తన పోరాటాన్ని ముమ్మరం చేసింది. ఆర్డినెనన్స్​కు వ్యతిరేకంగా ఆప్ ఆదివారం రామ్​లీలా మైదాన్​లో నిర్వహించిన 'మహా ర్యాలీ'లో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రసంగించారు. ఈ తరహా ఆర్డినెన్స్‌ త్వరలోనే ఇతర రాష్ట్రాల్లోనూ రానుందని వేదికపై నుంచి హెచ్చరించారు. అందరూ కలిసి ఐక్యంగా దీన్ని అడ్డుకోవాలన్నారు.

'నేను దేశ ప్రజలందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆర్డినెన్స్‌ కేవలం దిల్లీ ప్రజల కోసమే అని భావించవద్దు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ చేసిన మొదటి దాడి అని నాకు అంతర్గతంగా తెలిసింది. దిల్లీ ప్రజల అధికారం దోచుకునే విధంగా ఉన్న ఆ ఆర్డినెన్స్‌ను త్వరలోనే రాజస్థాన్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలోనూ తీసుకురానున్నారు. ఇది వారి నియంతృత్వ వైఖరికి నిదర్శనం. దీన్ని ఇప్పుడే ఆపాలంటే మనమంతా ఐక్యం కావాలి' అని ఆప్​ ర్యాలీలో అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

  • #चौथी_पास_राजा की कहानी को जितनी बार सुनोगे, दूसरों को सुनाओगे 📢

    उतनी ही भगवान की कृपा आपके परिवार पर बरसेगी।

    चौथी पास राजा की कहानी का प्रचार-प्रसार करने से देश और समाज की तरक़्क़ी होगी।

    इसलिए जिसने भी ये कहानी सुनी है, इसे दोबारा सुनना और अच्छे से प्रचार-प्रसार करना।

    -CM… pic.twitter.com/i0UZPPD90V

    — AAP (@AamAadmiParty) June 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కొందరు బీజేపీ నాయకులు నన్ను దూషించడమే పనిగా పెట్టుకున్నారు. నేను వాటిని పట్టించుకోను. కానీ కేంద్ర ప్రభుత్వం దిల్లీ ప్రజలను అవమానించే రీతిలో ప్రవర్తిస్తే.. నేను సహించను. కేంద్రం రాజ్యాంగాన్ని నమ్మదు. ఆర్డినెన్స్​పై సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ప్రధాని మోదీ తిరస్కరించడం ఆయన నియంతృత్వానికి అద్దం పడుతోంది. దిల్లీలో ప్రస్తుతం నిరంకుశపాలన కొనసాగుతోంది. రామ్​లీలా మైదాన్.. 12 ఏళ్ల క్రితం దేశంలో అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అప్పడు ఆ ఉద్యమం విజయవంతమైంది. ఇప్పుడు మళ్లీ ఇదే రామ్​లీలా మైదాన్​ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఉద్యమానికి వేదిక అయ్యింది. ఈ ఉద్యమం కూడా విజయవంతమవుతుంది" అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

అరెస్ట్​లపై స్పందించిన కేజ్రీవాల్..
"దిల్లీలో జరుగుతున్న అభివృద్ధిని ఆపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం.. మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్​లను అరెస్ట్​ చేసింది. కానీ మాకు 100 మంది సిసోదియాలు, మోర 100 మంది జైన్​లు ఉన్నారు. వారి పని వారు చేసుకుంటారు" అని కేజ్రీవాల్​ వ్యాఖానించారు. కాగా, దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోదియా మద్యం పాలసీ కేసులో ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మనీలాండరింగ్ కేసులో గతేడాది మేలో జైలుకెళ్లారు.

మోదీజీ గుజరాత్​ సీఎంగా, దేశ ప్రధానిగా 21 ఏళ్లు అధికారంలో ఉన్నా.. ఆయన చేయలేని ఎన్నో పనులు కేజ్రీవాల్ ఎనిమిదేళ్ల పదవీ కాలంలో చేశారని అన్నారు. బీజేపీ.. దిల్లీలో మేము చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఆప్​ దిల్లీలో పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తే.. మోదీజీ దిల్లీలో ఉచిత యోగా తరగతులు నిలిపివేశారని మండిపడ్డారు.

Last Updated :Jun 11, 2023, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.