'ఫోన్​పే' నుంచి రూ.52వేలు మాయం.. మొబైల్​ అన్​లాక్​ చేసి..

author img

By

Published : Nov 13, 2021, 2:13 PM IST

phonepe fraud

ఆన్​లైన్​ లావాదేవీలు పెరుగుతున్న తరుణంలో మోసాలు(E Wallet Frauds In India) కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. దిల్లీలో ఓ వ్యక్తి ఫోన్​పే నుంచి రూ.52వేలు మాయం చేశారు ఇద్దరు మోసగాళ్లు. అయితే.. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

కాలం గడుస్తున్న కొద్దీ డిజిటల్‌ చెల్లింపులు పుంజుకుంటున్నాయి. అయితే, అదే స్థాయిలో ఆన్‌లైన్‌ మోసాలూ(E Wallet Frauds In India) పెరిగిపోతున్నాయి. అందుకే ఇప్పటికీ కొంతమంది ఆన్‌లైన్‌ లావాదేవీలకు వెనుకాడుతున్నారు. తాజాగా దిల్లీలో రూ.52,000 కాజేసిన ఇద్దరు మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు.

నవంబరు 3న సందీప్‌ శర్మ అనే వ్యక్తి తన మొబైల్‌ పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నవంబరు 5న కొత్త ఫోన్‌ కొనుగోలు చేసి సిమ్‌ యాక్టివేట్‌ చేయించుకున్నాడు. కానీ, అప్పటికే తన ఫోన్‌పే ఖాతా యాక్టివ్‌గా(E Wallet Frauds In India) ఉన్నట్లు గుర్తించాడు. పైగా రూ.52,860 వేరే వారికి బదిలీ అయినట్లు కూడా తెలుసుకున్నాడు. వెంటనే బురారీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పాడు.

కిల్లీ కొట్టు యజమానికి..

దర్యాప్తు చేసిన పోలీసులు ఫోన్‌పే నుంచి నగదు బదిలీ అయిన సంజయ్‌ అనే వ్యక్తిని గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సందీప్‌ పోగొట్టుకున్న ఫోన్‌ రాహుల్‌ దాస్‌ అనే వ్యక్తికి దొరికింది. అతనికి టెక్నాలజీపై మంచి పట్టుండడం వల్ల ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి మొబైల్‌ వ్యాలెట్ల పిన్‌కోడ్‌లన్నింటినీ మార్చేశాడు. అలా ఫోన్‌పే నుంచి రూ.52 వేలు సంజయ్‌ అనే కిల్లీకొట్టు యజమానికి బదిలీ చేశాడు. తర్వాత కొంత మొత్తాన్ని సంజయ్‌.. రాహుల్‌కు ఇచ్చాడు. విచారణలో ఇవన్నీ బయటపడగా పోలీసులు ఇరువురినీ అరెస్టు చేశారు. సందీప్‌ పోగొట్టుకున్న మొబైల్‌తో పాటు రూ.20,000 విలువ చేసే మరో ఫోన్‌ని కూడా పోలీసులు రాహుల్‌ నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.