ETV Bharat / bharat

జలాంతర్గాముల మెగా ప్రాజెక్టుకు ఆమోదం

author img

By

Published : Jun 4, 2021, 2:18 PM IST

నౌకాదళం కోసం దేశీయంగా ఆరు శక్తిమంతమైన జలాంతర్గాముల నిర్మాణం చేపట్టే మెగా ప్రాజెక్టుకు రక్షణశాఖ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. దాదాపు రూ.43వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు.

Defence Ministry clears mega naval projec
భారత్​లో జలాంతర్గాముల తయారీ

భారత నౌకాదళం కోసం 6 సంప్రదాయ జలాంతర్గాముల నిర్మాణం చేపట్టే మెగా ప్రాజెక్టుకు రక్షణశాఖ శుక్రవారం ఆమోదం తెలిపింది. రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​ నేతృత్వంలో రక్షణ కొనుగోళ్ల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పి-75 పేరుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం టెండర్​ నోటిఫికేషన్​ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.

'భారత్​లో తయారీ' కింద ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.43వేల కోట్లు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చైనా నావిక దళ సామర్థ్యంతో సరితూగే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.

ఇదీ చూడండి: దేశీయంగా ఆరు జలాంతర్గాముల నిర్మాణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.