ETV Bharat / bharat

'డీప్​ఫేక్​ నియంత్రణ కోసం త్వరలోనే కొత్త వ్యవస్థ'- సోషల్​ మీడియా సంస్థల ప్రతినిధులతో ఐటీ మంత్రి భేటీ

author img

By PTI

Published : Nov 23, 2023, 1:17 PM IST

Updated : Nov 23, 2023, 2:09 PM IST

Deepfake Prevention Govt Measures : డీప్​ఫేక్​ సమస్యపై పోరాడేందుకు త్వరలోనే సరికొత్త నియంత్రణా వ్యవస్థను తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్​ తెలిపారు. ఈ విషయంలో సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​లతో కలిసి ముందుకు వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Union Minister Ashwini Vaishnaw Holds Key Meeting With Social Media Companies On Deepfakes
Deepfake Prevention Govt Measures

Deepfake Prevention Govt Measures : డీప్​ఫేక్​ వీడియోలు, ఫొటోలను పూర్తిగా నియంత్రించేందుకు త్వరలోనే కొత్త వ్యవస్థను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్​ వెల్లడించారు. ఇందుకోసం గురువారం సోషల్​ మీడియా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఇలాంటి (డీప్​ఫేక్​) వీడియోలను అరికట్టేందుకు మీడియా డిటెక్షన్​, ప్రివెన్షన్​, రిపోర్టింగ్​ మెకానిజం సహా ఇతర అంశాలతో కూడిన ఓ బలోపేతమైన వ్యవస్థ అవసరమని గుర్తించినట్లుగా మంత్రి వివరించారు. ఈ వ్యవహారంలో సామాజిక మాధ్యమాలతో కలిసి ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

'అవసరమైతే కొత్త చట్టం తెస్తాం..'
టెక్నాలజీ సాయంతో డీప్‌ఫేక్‌ సృష్టిస్తున్న నష్టం ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పును తెచ్చిపెడుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 'మేము డీప్​ఫేక్​ నియంత్రణనకు సంబంధించి ఈరోజే ముసాయిదా పనులను ప్రారంభిస్తాము. తక్కువ సమయంలోనే ఇందుకు కావాల్సిన కొత్త నిబంధనలు తయారు చేస్తాము. సాంకేతికత దుర్వినియోగం విషయంలో ఇప్పటికే ఉన్న ఫ్రేమ్​వర్క్​ను సవరించాలా లేదా కొత్త నిబంధనలు తీసుకురావాలా, అవసరమైతే చట్టాని తీసుకురావచ్చా అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నాం' అని మంత్రి వ్యాఖ్యానించారు.

  • #WATCH | Delhi: After meeting with social media companies on the issue of Deep fake, Union Minister for Communications, Electronics & IT Ashwini Vaishnaw says, "We have all agreed that within the next about 10 days, we will come up with clear actionable items...All the companies,… pic.twitter.com/3h0hMyCk1C

    — ANI (@ANI) November 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"డీప్​ఫేక్​ అనేది సమాజానికి అత్యంత ప్రమాదకరం. ఇటీవలి కాలంలో ఇలాంటివి ఎక్కువైపోయాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే వీటికి సంబంధించి నిబంధనలు, విధి విధానాలను తీసుకువస్తాము. ఈ విషయంలో సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​లతో కలిసి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నాము."

- అశ్విని వైష్ణవ్​, కేంద్ర ఐటీ శాఖ మంత్రి

ఇదే అంశంపై డిసెంబర్ మొదటి వారంలో మరోసారి సమావేశమవుతామని మంత్రి చెప్పారు. తదుపరి భేటీలో గురువారం(నవంబర్ 23న) తీసుకున్న నిర్ణయాలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి, ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అనే దానిపై కూడా చర్చిస్తామని అశ్విని వైష్ణవ్​ తెలిపారు.

  • #WATCH | Delhi: On Deep fake, Union Minister for Communications, Electronics & IT Ashwini Vaishnaw says, "Deep fake has emerged as a new threat in the society. We need to take immediate steps. Today a meeting was held with social media platforms. We've to focus on four… pic.twitter.com/oFdgdxXywo

    — ANI (@ANI) November 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Delhi: Union Minister for Communications, Electronics & IT Ashwini Vaishnaw today chaired a meeting with social media platforms and stakeholders, on the issue of Deep fake. pic.twitter.com/i6p9v4Lxxo

    — ANI (@ANI) November 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

డీప్​ఫేక్​పై ప్రధాని మోదీ..
ఇటీవలే ఈ డీప్​ఫేక్​ టెక్నాలజీ కారణంగా చాలామంది ప్రముఖులు ఇబ్బంది పడ్డారు. ఇందులో సినీ నటి రష్మికతో పాటు, బాలీవుడ్‌ నటి కాజోల్‌ కూడా ఉన్నారు. అయితే ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం G20 వర్చువల్ సమ్మిట్​లో స్పందించారు. AI ప్రతికూల ప్రభావాల గురించి ప్రపంచం ఆందోళన చెందుతోందన్నారు. కృత్రిమ మేధ కోసం ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సమాజానికి డీప్​ఫేక్​ సాంకేతికత ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవాలని సూచించారు. వీటి నుంచి బయటపడేందుకు కృషి చేయాలని కోరారు.

సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ కన్నుమూత

మరి కొద్ది గంటల్లో సొరంగం నుంచి కార్మికులు బయటకు- 41 బెడ్లతో ఆస్పత్రి సిద్ధం, ఘటనాస్థలికి సీఎం

Last Updated :Nov 23, 2023, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.