ETV Bharat / bharat

పంచాయతీ ఎన్నికల్లో హింస.. 15 మంది బలి.. కాంగ్రెస్, బీజేపీ ఆందోళనలు.. పోలీసుల లాఠీఛార్జ్​!

author img

By

Published : Jul 9, 2023, 7:28 PM IST

Updated : Jul 9, 2023, 8:30 PM IST

West Bengal Panchayat Election Violence : బంగాల్​ పంచాయతీ ఎన్నికలు ముగిసినా ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో అక్రమాలు, హింసాత్మక ఘటనలను వ్యతిరేకిస్తూ ఆదివారం.. కాంగ్రెస్‌, బీజేపీ ఆందోళనకు దిగాయి. పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇప్పటి వరకు బంగాల్‌ పంచాయతీ ఎన్నికల్లో చనిపోయినవారి సంఖ్య 15కు పెరిగింది.

West Bengal Panchayat Election Violence
West Bengal Panchayat Election Violence

West Bengal Violence 2023 : బంగాల్ పంచాయతీ ఎన్నికల్లో పెద్దఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయి. వేర్వేరు జిల్లాల్లో జరిగిన ఘటనల్లో మరణించినవారి సంఖ్య 15కు పెరిగింది. పోలింగ్‌ రోజు వివిధ పార్టీలకు చెందిన 12మంది చనిపోగా.. ఆదివారం మరో ముగ్గురు మృతిచెందారు. దక్షిణ 24పరగణాల జిల్లాలోని పశ్చిమ గబ్‌టాలా పోలింగ్‌ కేంద్రం సమీపంలో ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడిని టీఎంసీ కార్యకర్త అబు సలెంఖాన్‌గా గుర్తించారు. నిన్న జరిగిన అల్లర్లలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు కూడా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరు కూడా టీఎంసీ కార్యకర్తలే అని పేర్కొన్నారు.

West Bengal Panchayat Election Violence
ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా

West Bengal Violence Death Toll : పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా జరిగిన అల్లర్లలో ఇప్పటివరకు టీఎంసీకి చెందినవారు 11మంది మృతిచెందగా.. కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎం మద్దతుదారులు ఒక్కొక్కరు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. మరో మృతుడిని గుర్తించాల్సి ఉందన్నారు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం మొత్తం 18మంది చనిపోయినట్లు పేర్కొన్నాయి. పంచాయతీ ఎన్నికల వేళ సంభవించిన మరణాలపై సమగ్ర నివేదిక పంపాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. 24 గంటల్లో నివేదిక సమర్పించాలని కోరినట్లు.. ఈసీ అధికారులు చెప్పారు.

West Bengal Panchayat Election Violence
తీవ్రంగా గాయపడ్డ మాల్దా డీఎస్పీ

మరోవైపు.. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలతోపాటు పోలింగ్‌ సందర్భంగా అక్రమాలను నిరసిస్తూ.. పలు ప్రాంతాల్లో జరిగిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పలుచోట్ల పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. శ్రీకృష్ణాపుర్‌ హైస్కూల్‌ కౌంటింగ్‌ సెంటర్‌లో బ్యాలెట్‌ బాక్స్‌లను ట్యాంపరింగ్‌ చేశారని ఆరోపిస్తూ .. పూర్వ మిడ్నాపుర్‌ జిల్లాలో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. జాతీయ రహదారిని దిగ్బంధించాయి.

West Bengal Panchayat Election Violence
ధర్నా చేస్తున్న కాంగ్రెస్​ శ్రేణులు

తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో బ్యాలెట్‌ బాక్స్‌లను మార్చినట్లు తమకు సమాచారం ఉందని, అందువల్ల కౌంటింగ్‌ కేంద్రం పరిధిలోని అన్ని పోలింగ్ బూత్‌ల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటం వల్ల.. లాఠీచార్జ్‌ చేసి ఆందోళనకారులను చెదరగొట్టినట్లు పోలీసులు తెలిపారు. మాల్దా జిల్లా రథ్‌బరి ప్రాంతంలోనూ కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. ఎన్నికల అక్రమాలపై కోర్టును ఆశ్రయించనున్నట్లు హెచ్చరించారు.

West Bengal Panchayat Election Violence
గాయపడ్డ పోలీసు

గవర్నర్​ దిల్లీ పయనం.. అమిత్​ షాతో భేటీ!
శనివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్​లో జరిగిన హింసాత్మక ఘటనలతో రాష్ట్రం అట్టుడికింది. పోలీసులు 10 మరణాలను ధ్రువీకరించినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో బంగాల్ గవర్నర్​ సీవీ ఆనంద బోస్​ దిల్లీ పయనమయ్యారు. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్​ షాను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

  • #WATCH | Kolkata: West Bengal Governor CV Ananda Bose leaves for Delhi

    He is likely to meet Union Home Minister Amit Shah over panchayat poll violence pic.twitter.com/er00I7hyuc

    — ANI (@ANI) July 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మూడంచెల పంచాయతీ వ్యవస్థ అమల్లో ఉన్న బంగాల్​లో.. 73,887 పంచాయతీ సీట్లకు శనివారం పోలింగ్‌ జరిగింది. 5కోట్ల 67లక్షల మంది ఓటర్లు ఉండగా.. 66.28 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 2లక్షల మందికిపైగా అభ్యర్థులు పోటీ చేశారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో కుచ్‌ బెహార్‌ జిల్లా దిన్‌హటా ప్రాంతంలోని 32 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించారు.

Last Updated :Jul 9, 2023, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.