ETV Bharat / bharat

ఉప్మాలో పాముపిల్ల- 56 మందికి విద్యార్థులకు అస్వస్థత

author img

By

Published : Nov 18, 2021, 5:24 PM IST

dead snake in breakfast
ఉప్మాలో పాముపిల్ల.. 56 మందికి పిల్లలకు అస్వస్థత

ఓ బోర్డింగ్​ స్కూల్​కు చెందిన 56 మంది విద్యార్థులు గురువారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. వారు తిన్న ఆహారంలో ఓ చచ్చిన పాము ఉండటమే అందుకు కారణం. ఈ ఘటన కర్ణాటక యాదగిరి జిల్లాలో జరిగింది.

ఓ బోర్డింగ్​ స్కూల్​ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా 56 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బ్రేక్​ఫాస్ట్​లో చచ్చిన పాముపిల్ల ఉండటమే ఇందుకు కారణం. ఈ ఘటన కర్ణాటకలోని యాదగిరి జిల్లా అబ్బేతుమ్కుర్​ గ్రామంలో గురువారం జరిగింది.

ఇదీ జరిగింది..

అబ్బేతుమ్కుర్​లోని విశ్వరస్య విద్యావర్థక బోర్డింగ్​ స్కూల్​లో ఉదయం బ్రేక్​ఫాస్ట్​గా ఉప్మా తింటున్న విద్యార్థులు అందులో చచ్చిన పాముపిల్లను గుర్తించారు. వెంటనే యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కానీ అప్పటికే చాలా మంది ఆ ఆహారం తీసుకోవడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించిన యాజమాన్యం ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించింది.

విద్యార్థుల్ని స్థానిక ఎమ్మెల్యే వెంకటరెడ్డి, జిల్లా ఎస్​పీ వెండమూర్తి పరామర్శించారు. పిల్లల ఆరోగ్య స్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చూడండి : 'హిందుత్వంలో హిందూ భావనే లేదు.. అది సంఘీ ధర్మం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.