ETV Bharat / bharat

పిల్లల కోసం మూడు వ్యాక్సిన్లు- డీసీజీఐ అనుమతి

author img

By

Published : Apr 26, 2022, 1:48 PM IST

Updated : Apr 26, 2022, 3:46 PM IST

DGCI Grants Emregency Use Of Vaccine: 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 5 నుంచి 12 ఏళ్ల వారికి కార్బెవాక్స్‌ టీకాను ఇచ్చేందుకు కూడా పచ్చజెండా ఊపింది. మరోవైపు 12 ఏళ్లు పైబడిన పిల్లలకు జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి ఇచ్చేందుకు కూడా డీసీజీఐ అత్యవసర అనుమతులు మంజూరు చేసింది

vaccine news
vaccine news

DGCI Grants Emregency Use Of Vaccine: దేశంలో టీకా పంపిణీని మరింత విస్తరిస్తూ చిన్న పిల్లలకు కొవిడ్‌ టీకా ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. ప్రముఖ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకాను 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఇవ్వడానికి భారత ఔషధ నియంత్రణ మండలి- డీసీజీఐ అత్యవసర అనుమతి మంజూరు చేసింది. దీంతో పాటు 5 నుంచి 12 ఏళ్ల వారికి బయోలాజికల్ - ఇ సంస్థ తయారు చేసిన కార్బెవాక్స్‌ టీకాను పంపిణీ చేసేందుకు కూడా డీసీజీఐ అనుమతులిచ్చింది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

కొవాగ్జిన్‌ టీకాను ఇప్పటికే 12 ఏళ్లు పైబడిన వారికి ఇస్తున్నారు. దీన్ని చిన్న పిల్లలకు సైతం ఇచ్చేందుకు అనుమతి కోరుతూ భారత బయోటెక్ గతంలో దరఖాస్తు చేసుకుంది. పిల్లలపై నిర్వహించిన క్లినికల్‌ పరీక్షల సమాచారాన్ని, సంబంధిత ఇతర వివరాలను అందజేసింది. 5 నుంచి 12 ఏళ్ల వారికి కార్బెవాక్స్‌ టీకా పంపిణీ కోసం బయోలాజికల్ - ఇ సంస్థ కూడా దరఖాస్తు చేసుకుంది. వీటి సమాచారాన్ని, ప్రయోగ పరీక్షల ఫలితాలను విశ్లేషించేందుకు సబ్జెక్టు నిపుణుల కమిటీ.. ఎస్​ఈసీ గత గురువారం భేటీ అయ్యింది. 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు కొవాగ్జిన్‌ టీకాను, 5 నుంచి 12 ఏళ్ల వారికి కార్బెవాక్స్‌ టీకాను ఇచ్చేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా.. డీసీజీఐకి సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనల మేరకు ఈ టీకాలకు అత్యవసర అనుమతులను డీసీజీఐ జారీ చేసింది.

టీకా పంపిణీ మొదలైన తర్వాత తొలి రెండు నెలల పాటు ప్రతి 15 రోజులకోసారి భద్రతా డేటాను అందజేయాలని డీసీజీఐ ఆదేశించింది. ఆ తర్వాత 5 నెలల పాటు నెలకోసారి ఈ వివరాలను ఇవ్వాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 5 ఏళ్లు పైబడిన పిల్లలకు ఇచ్చే టీకాలకు అత్యవసర అనుమతులు లభించిన నేపథ్యంలో త్వరలోనే ఈ వయసు వారికి వ్యాక్సిన్‌ పంపిణీపై కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయం ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరోవైపు 12 ఏళ్లు పైబడిన పిల్లలకు జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి ఇచ్చేందుకు కూడా డీసీజీఐ అత్యవసర అనుమతులు మంజూరు చేసింది.

ఇదీ చదవండి: దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ మరణాలు

Last Updated : Apr 26, 2022, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.