ETV Bharat / bharat

అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ సోదరుడు అరెస్టు

author img

By

Published : Jun 23, 2021, 4:40 PM IST

Updated : Jun 23, 2021, 5:52 PM IST

iqbal kaskar
ఇక్బాల్ కస్కర్, దావూద్ సోదరుడు

అండర్​వరల్డ్ డాన్​ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్​ను అరెస్టు చేశారు ముంబయి ఎన్​సీబీ అధికారులు. మాదక ద్రవ్యాల సరఫరా కేసుకు సంబంధించి ఇక్బాల్​ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

అండర్​వరల్డ్​ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్​ను అరెస్టు చేశారు ముంబయి మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ అధికారులు. డ్రగ్స్​ సరఫరా కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఇటీవలే అధికారులు సీజ్​ చేసిన 15 కేజీల హాషిష్​ మత్తు పదార్థం సరఫరాలో.. కస్కర్​ పాత్ర ఉన్నట్లు ఎన్సీబీ అధికారులు పేర్కొన్నారు. 2017లోనే దోపిడీ కేసులో థానే పోలీసులు కస్కర్​ను అరెస్టు చేశారు. అయితే.. బుధవారం కస్కర్​ను బల్లార్డ్ ఎస్టేట్ ఎన్సీబీ కార్యాలయానికి తరలించారు.

iqbal kaskar
దావూద్ సోదరుడు ఇక్బాల్

ఇటీవలే దావూద్​ అనుచరులను కొందరిని మాదక ద్రవ్యాల సరఫరా కేసులో అరెస్టు చేశారు అధికారులు. జమ్ముకశ్మీర్​ నుంచి ముంబయికి డ్రగ్స్​ తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇక్బాల్​ను అదుపులోకి తీసుకున్నారు. 2003లో​ యూఏఈ నుంచి తిరిగివచ్చినప్పటినుంచి కస్కర్​.. డ్రగ్స్​ దందా నడిపిస్తున్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి:డ్రగ్స్​ ముఠా గుట్టురట్టు- దావూద్​ అనుచరుడు అరెస్ట్​

Last Updated :Jun 23, 2021, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.