ETV Bharat / bharat

నృత్యం చేస్తూ పిల్లలకు వైద్యం.. ఈ 'డ్యాన్సింగ్​ డాక్టర్​' స్టైలే వేరు!

author img

By

Published : Jun 4, 2022, 8:29 PM IST

Updated : Jun 5, 2022, 10:01 AM IST

నృత్యం చేస్తూ.. చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు రాజస్థాన్​లోని జోధ్​పుర్​కు చెందిన వైద్యులు రాజ్​ ధారీవాల్​. 71 ఏళ్ల వయసులోనే తన నృత్యాలతో ఉత్సాహ పరుస్తూ.. డ్యాన్సింగ్​ డాక్టర్​గా పేరుగాంచారు. ఆయన నృత్యాల విశేషాలేంటో తెలుసుకుందాం.

dancing doctor
డ్యాన్సింగ్​ డాక్టర్

ప్రతి సమస్యకు సంగీతం ఒక ఔషధంగా పని చేస్తుందని చెబుతుంటారు. నృత్యాలు చేయటం, పాటలు వినటం చేస్తే మనలోని అంతర్గత శక్తి రెట్టింపవుతుందని వైద్యశాస్త్రం చెబుతోంది. శారీరక, మానసిక ధృడత్వం కోసం చాలా మంది వైద్యులు డ్యాన్స్​ చేయాలని, పాటలు వినమని సూచిస్తుంటారు. అలాంటి దారిలోనే వెళ్తున్నారు రాజస్థాన్​లోని జోధ్​పుర్​కు చెందిన ఓ వైద్యుడు. తనదైన శైలిలో రోగులకు చికిత్స అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. తన వద్దకు వచ్చే వారికి నృత్యాలు చేయమని సూచిస్తుంటారు. వారితో పాటు కాలు కదుపుతారు కూడా. ఓ వైపు డ్యాన్స్​ చేస్తూనే.. వైద్యం అందించటం ఆయన ప్రత్యేకత. ఆయనే.. జోధ్​పుర్​కు చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్​ రాజ్​ ధారీవాల్​.

71 ఏళ్ల వయసులోనూ.. వృత్తి రీత్యా చిన్నపిల్లల వైద్యుడైన డాక్టర్​ రాజ్​ ధారీవాల్​ మనస్తత్వం సైతం చిన్న పిల్లల మాదిరిగానే ఉంటుంది. చిన్నారుల మనుసులో చాక్లెట్​, ఐస్​క్రీమ్​ వంటివి మెదులుతున్నట్లే.. ఈ వైద్యుడి మనసులో డ్యాన్స్​ ఉంటుంది. 71 ఏళ్ల వయసులోనూ ఎంతో ధృడంగా ఉంటారు. ప్రతిరోజు నృత్యం చేస్తానని, దాని వల్లే తన శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికీ రోజులో 10గంటలు తన వద్దకు వచ్చే రోగులకు చికిత్స అందిస్తుంటారు ధారీవాల్​. వైద్యంతో పాటు అనారోగ్యానికి గురైన చిన్నారులు నిత్యం డ్యాన్స్​ చేయాలని సూచిస్తుంటారు. వారికి డ్యాన్స్​ నేర్పించేందుకు సైతం ఇష్టపడతారు.

డ్యాన్సింగ్​ డాక్టర్​: వివాహ వేడుకల్లో వేదికపైన నృత్యాలు చేస్తుంటారు చేస్తుంటారు డాక్టర్​ ధారీవాల్​. 71 ఏళ్ల వయసు వచ్చినా శారీరకంగా ధృడంగా ఉండటం చూసి అంతా ఆశ్చర్యానికి గురవుతుంటారు. ఈ కారణంగానే ఆయన జోధ్​పుర్​లో 'డ్యాన్సింగ్​ డాక్టర్​'గా పేరుగాంచారు. ఆయన డ్యాన్స్​కు సంబంధించిన ఓ వీడియో ఇటీవల వైరల్​గా మారింది. అందులో ఓ పాత సినిమా పాటకు ఆయన పెళ్లి వేదికపై నృత్యం చేశారు. ప్రతి రోజు ఉదయపు నడక, వ్యాయామం, యోగాలతో పాటు ఒక గంట పాటు నృత్యం చేస్తానని చెబుతున్నారు ధారీవాల్.

డాక్టర్​ ధారీవాల్​కు ముగ్గురు కుమారులు. వారంతా ఐఐటీల్లో చదివారు. తన కోడలితో పాటు కుటుంబ సభ్యులు మొత్తం తమ నిత్యజీవితంలో డ్యాన్స్​ను ఒక భాగం చేసుకున్నారు. ఆయనకు కొద్ది రోజుల క్రితం బైపాస్​ సర్జరీ జరిగింది. ప్రస్తుతం మధుమేహం, ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయామం, యోగా, నృత్యాలతో పాటు పంచదార, జంక్​ఫుడ్​కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: 27 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీకొడుకులు.. భావోద్వేగంతో కంటతడి

మరణించిన తండ్రి సమక్షంలోనే ఘనంగా కుమార్తె పెళ్లి!

Last Updated :Jun 5, 2022, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.