ETV Bharat / bharat

డ్రగ్స్​ కేసులో ఆర్యన్​ఖాన్​ అరెస్ట్​- బాలీవుడ్​ లింకులపై ఎన్​సీబీ ఆరా!

author img

By

Published : Oct 4, 2021, 6:55 AM IST

సముద్ర జలాలపై విహరిస్తూ(cruise ship rave party ) విచ్చలవిడిగా సాగిస్తున్న అకృత్యాలకు పకడ్బందీ వ్యూహంతో కళ్లెం వేశారు మహారాష్ట్ర పోలీసులు. ప్రయాణికుల్లా వెళ్లి విహారనౌకలో రేవ్‌ పార్టీని భగ్నం చేశారు. మాదకద్రవ్యాల స్వాధీనం(Drugs case) చేసుకుని బాలీవుడ్​ సూపర్​స్టార్​ షారుక్​ఖాన్​ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ సహా మరో ఏడుగురిని అరెస్టు(Aryan Khan arrest news) చేశారు. డ్రగ్స్​ వ్యవహారంతో బాలీవుడ్‌ లింకులు బయటకు తీస్తామని స్పష్టం చేసింది ఎన్‌సీబీ.

Aryan Khan
డ్రగ్స్​ కేసులో ఆర్యన్​ఖాన్​ అరెస్ట్

రేవ్‌ పార్టీ ముసుగులో(cruise ship rave party ) మాదకద్రవ్యాల మత్తులో జోగుతున్న సంపన్నవర్గాల వారసులను మహారాష్ట్ర ఉన్నతాధికారులు అరెస్టు చేశారు. సముద్ర జలాలపై విహరిస్తూ విచ్చలవిడిగా సాగిస్తున్న అకృత్యాలకు పకడ్బందీ వ్యూహంతో కళ్లెం(Cruise ship drugs raid) వేశారు. శనివారం రాత్రి ముంబయి నుంచి గోవా వెళ్తున్న ఓడలో ఏర్పాటుచేసిన రేవ్‌ పార్టీపై ఎన్సీబీ అధికారులు జరిపిన దాడిలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ (23) సహా మరో ఏడుగురు అరెస్టయ్యారు(Aryan Khan arrest news). ఈ పార్టీలో కొంతమంది దుస్తుల్లో దాచుకొన్న ఎక్‌స్టసీ, కొకెయిన్‌, మఫెడ్రోన్‌ (ఎండీ), చరస్‌ వంటి మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు యువతులతోపాటు అదుపులోకి తీసుకున్న బృందంలో మూన్‌మూన్‌ ధామేచ, నుపుర్‌ సారిక, ఇస్మీత్‌ సింగ్‌, మోహక్‌ జస్వాల్‌, విక్రాంత్‌ ఛోకర్‌, గోమిత్‌ చోప్రా, ఆర్యన్‌ఖాన్‌, అర్బాజ్‌ మర్చంట్‌ ఉన్నారు. వీరందరికీ అధికారులు వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా ఆర్యన్‌ఖాన్‌, మూన్‌మూన్‌ ధామేచ, అర్బాజ్‌ మర్చంట్‌లను రిమాండు నిమిత్తం ఆదివారం స్పెషల్‌ హాలిడే కోర్టు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. ఈ ముగ్గురూ సోమవారం దాకా ఎన్సీబీ కస్టడీలో ఉండేలా కోర్టు ఆదేశించింది. తన క్లయింటు రేవ్‌ పార్టీ నిర్వాహకుల ఆహ్వానం మేరకే అక్కడికి వెళ్లాడని, డ్రగ్స్‌(Drugs case news) తీసుకోలేదని ఆర్యన్‌ఖాన్‌ తరఫు న్యాయవాది వాదించారు. దాడిలో పట్టుబడిన మిగతా అయిదుగురినీ సోమవారం కోర్టులో హాజరుపరుస్తారు.

సంగీత హోరులో సముద్ర ప్రయాణం
ఓ టీవీ ఛానల్‌ భాగస్వామిగా నిర్వహించిన ఈ రేవ్‌ పార్టీలో(cruise ship rave party )సంగీత హోరు నడుమ రెండు రోజుల సముద్ర ప్రయాణం ఏర్పాటు చేశారు. అక్టోబర్‌ 2 - 4 తేదీల మధ్య ఉంటుందని ప్రకటించారు. వంద టికెట్లను మాత్రమే విక్రయానికి ఉంచి, మిగిలినవి నిర్వాహకులే అమ్మారు. సంపన్నులు ఎగబడ్డ ఈ పార్టీ కోసం చాలామంది టికెట్లు కొని కూడా ఓడ ఎక్కలేకపోయారు. ఓ మహిళ రూ.82 వేలు చెల్లించినా షిప్‌ నిండిపోయిందంటూ ఆమెను వెనక్కు పంపారు. ఈ ఓడ ప్రయాణికులు సామర్థ్యం 1,800. ఇటువంటి పార్టీల్లో ముఖ్యంగా ఎండీఎంఏ అనే సింథటిక్‌ డ్రగ్స్‌ను వినియోగిస్తుంటారు.

సమీర్‌ వాంఖెడె నేతృత్వంలో..

సమర్థుడైన అధికారిగా పేరున్న జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడె నేతృత్వంలో 22 మంది ఎన్సీబీ అధికారులు ప్రయాణికుల్లా నటిస్తూ ఓడ ఎక్కారు. సముద్రం మధ్యలోకి ఓడ వెళ్లిన తర్వాత పార్టీ మొదలైంది. అదను చూసి అధికారులు దాడికి దిగారు. కాగా, ఈ సంఘటనతో తమకెలాంటి సంబంధం లేదని.. అధికారులతో పూర్తిగా సహకరిస్తామని గోవాకు చెందిన ఓడ కంపెనీ ప్రకటించింది. గత కొన్నిరోజులుగా దేశంలో మాదకద్రవ్యాల ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. సెప్టెంబరులో గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవులో భారీగా 3 వేల కిలోల హెరాయిన్‌ పట్టుబడిన విషయం తెలిసిందే. దిల్లీ, నోయిడాల్లోనూ 37 కిలోల మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. ముంబయిలోనూ సమీర్‌ వాంఖెడె బృందం గత రెండేళ్లలో మొత్తం రూ.17,000 కోట్ల డ్రగ్స్‌ పట్టుకుంది.

హీరోగా వస్తాడనుకుంటే..

బాలీవుడ్‌ హీరోగా జనం ముందుకొచ్చే దశలో కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టు కావడం షారుక్‌ కుటుంబాన్ని కలవరపాటుకు గురిచేసింది. నటి దీపికా పదుకొణెతో కలిసి నటిస్తున్న 'పఠాన్‌' చిత్రం పాట చిత్రీకరణ కోసం స్పెయిన్‌ వెళ్లాల్సిన షారుక్‌ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎప్పటికప్పుడు కేసు పురోగతి గురించి తెలుసుకొంటూ, న్యాయవాదితో సంప్రదింపులు జరుపుతూ గడిపారు. ఆర్యన్‌ఖాన్‌ తల్లి గౌరీఖాన్‌ కూడా కుమారుడి అరెస్టు గురించి విని కుంగిపోయారు. విదేశాల్లో చదివి, తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్‌ సాధించిన ఆర్యన్‌ మీడియాకు దూరంగా ఉంటున్నా.. ఇన్‌స్టాలో 14 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం.

'ముంద్రా' దృష్టి మళ్లించేందుకే: కాంగ్రెస్‌

ముంద్రా ఓడరేవులో భారీగా పట్టుబడ్డ హెరాయిన్‌ కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఎన్సీబీ తాజా దాడి చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ముంద్రా ఉదంతంపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి షమా మొహమ్మద్‌ మీడియాతో మాట్లాడుతూ.. సొంత రాష్ట్రంలో బయటపడిన డ్రగ్స్‌ గురించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా మౌనం వీడాలన్నారు.

పిల్లాడు.. ఊపిరి తీసుకోనీ : సునీల్‌శెట్టి

'కేసును అధికారులు విచారిస్తారు. ఆ పిల్లాడిని కాస్త ఊపిరి తీసుకోన్విండి' అంటూ బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఆర్యన్‌ఖాన్‌ అరెస్టుపై ఆయన స్పందిస్తూ.. 'వాస్తవాలు బయటికి రానివ్వండి. బాధ్యతగా వ్యవహరిద్దాం' అన్నారు.

"మేము అరెస్టు చేసిన వారికి మత్తు పదార్థాలు విక్రయించేవారితో సంబంధాలు ఉన్నాయి. కావాలంటే వాట్సప్‌ సంభాషణల వంటి సాక్ష్యాలు చూపగలం. ఈ కేసు ఆధారంగా మత్తు పదార్థాల వ్యాపారులతో బాలీవుడ్‌కు ఉన్న సుదీర్ఘ సంబంధాలను వెలికితీసే ప్రయత్నం చేస్తాం"

- మత్తుపదార్థాల నియంత్రణ దళం(ఎన్సీబీ)

ఇలా చెబితే రెచ్చిపోరా!

'నా కొడుకు అమ్మాయిలతో డేటింగ్‌ చేయొచ్చు. సిగరెట్‌ తాగొచ్చు. సెక్స్‌, డ్రగ్స్‌ను కూడా ఆస్వాదించవచ్చు. అన్నిరకాలుగా అతను ఎంజాయ్‌ చేయవచ్చు'.. గతంలో షారుక్‌ఖాన్‌ తన కుమారుడు ఆర్యన్‌ గురించి సరదాగా చేసిన ఈ కామెంట్లు ఇపుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. పరిస్థితులు సహకరించక గతంలో తాను కోల్పోయిన యవ్వన సరదాలు తన పిల్లలు కోల్పోరాదని సగటు తండ్రిలా ఆలోచించడం తప్పు కాదు. ఆ సరదాలు మరీ ఇలా విచ్చలవిడిగా ఉంటే జరిగేది అనర్థమే.

Aryan Khan
షారుక్​ఖాన్​తో.. ఆర్యన్​ఖాన్​

ఇదీ చూడండి: Drugs case news: షారుక్​ తనయుడి గురించి ఈ విషయాలు తెలుసా?

మాదకశక్తులతో దేశ భవితవ్యం ఛిన్నాభిన్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.