పోలీస్​ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​.. దరఖాస్తుకు వారం రోజులే ఛాన్స్​

author img

By

Published : May 15, 2023, 4:17 PM IST

crpf recruitment 2023
crpf recruitment 2023 ()

CRPF Recruitment 2023 : ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను సీఆర్​పీఎఫ్​ విడుదల చేసింది. అందుకు సంబంధించిన అర్హత, వయోపరిమితితోపాటు ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం.

CRPF Recruitment 2023 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) గ్రూప్ బీ, సీ (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 212 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

  • మొత్తం ఖాళీలు - 212
  • సబ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌వో): 19
  • సబ్ ఇన్‌స్పెక్టర్ (క్రిప్టో): 7
  • సబ్ ఇన్‌స్పెక్టర్ (టెక్నికల్): 5
  • సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్) (మేల్‌): 20
  • అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (టెక్నికల్): 146
  • అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (డ్రాఫ్ట్స్‌మ్యాన్): 15

నోటిఫికేషన్ వివరాలు..

  • అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, మెడికల్‌ ఫిట్‌నెస్‌ కలిగి ఉండాలి.
  • CRPF Recruitment 2023 Age Limit వయోపరిమితి: అభ్యర్థుల వయసు 21.5.2023 నాటికి ఎస్‌ఐ పోస్టులకు 30 ఏళ్లలోపు.. ఏఎస్‌ఐ పోస్టులకు 18-25 ఏళ్లలోపు ఉండాలి.
  • జీత భత్యాలు: నెలకు ఎస్‌ఐ పోస్టులకు రూ.35,400 - రూ.1,12,400, ఏఎస్‌ఐ పోస్టులకు రూ.29,200 - రూ.92,300 మధ్య ఉంటుంది.
  • దరఖాస్తు ఫీజు: ఎస్‌ఐ పోస్టులకు రూ.200, ఏఎస్‌ఐ పోస్టులకు రూ.100 చెల్లించాలి (ఎస్సీ/ ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది)
  • CRPF Recruitment 2023 Selection Process ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్/ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్ నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 2023, మే 01
  • దరఖాస్తులకు చివరి తేదీ: 2023, మే 21
  • అడ్మిట్ కార్డ్ విడుదల: 2023, జూన్‌ 13
  • రాత పరీక్ష తేదీలు: 2023, జూన్‌ 24, 25.
  • నోటిఫికేషన్​కు సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటే అధికారిక వెబ్‌సైట్‌ https://rect.crpf.gov.in/ ను సందర్శించండి.

టాటా సంస్థలో ఉద్యోగాలు..
టాటా మెమోరియల్​లోని మెడికల్, నాన్-మెడికల్ పోస్ట్​లకు గాను 55 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​ జారీ చేసింది. రిక్రూట్‌మెంట్​కు సంబంధించిన విద్యార్హత, వయోపరిమితితో పాటు ఇతర ముఖ్యమైన వివరాలను నోటిఫికేషన్​లో పేర్కొంది. దరఖాస్తు వివరాలతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి.. ఆ తర్వాత అప్లికేషన్​లో పేర్కొన్న ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.