ETV Bharat / bharat

ఒమిక్రాన్​ కట్టడికి మరిన్ని ఆంక్షలు.. పాఠశాలలు, థియేటర్లు బంద్​!

author img

By

Published : Dec 28, 2021, 2:27 PM IST

Updated : Dec 28, 2021, 3:17 PM IST

covid restrictions delhi
ఒమిక్రాన్​ కట్టడికి మరిన్ని ఆంక్షలు.. పాఠశాలలు బంద్​!

Covid restrictions in India: ఒమిక్రాన్​ వ్యాప్తితో రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల వలయంలోకి జారుకుంటున్నాయి. ఇప్పటికే అనే రాష్ట్రాలు నైట్​ కర్ఫ్యూను విధించాయి. తాజాగా ఒమిక్రాన్​ కట్టడికి మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్టు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఎల్లో అలర్ట్​ జారీ చేశారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​.

Covid restrictions Delhi: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​.. దేశాన్ని వణికిస్తోంది. ఇప్పటివరకు కేసులు అత్యల్పంగా ఉన్న దిల్లీలోనూ గత కొన్ని రోజులుగా కొవిడ్​ బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరుగిపోయింది. ఈ క్రమంలో కఠిన ఆంక్షలు విధించేందుకు దిల్లీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ విషయాన్ని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ప్రకటించారు. దిల్లీలో ఎల్లో అలర్ట్​ జారీ చేస్తూ.. జీఆర్​ఏపీ(గ్రేడెడ్​ రెస్పాన్స్​ యాక్షన్​ ప్లాన్​)లో భాగంగా పలు ఆంక్షలు విధించినున్నట్టు స్పష్టం చేశారు. వీటిపై త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. దేశ రాజధానిలో తాజా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు కేజ్రీవాల్​.

ఆంక్షలు ఇవే..!

  • నైట్​ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
  • మెట్రో, బార్లు, ప్రైవేటు ఆఫీసులు.. 50శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి.
  • పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లు మూసివేసి ఉంటాయి.
  • బస్సులు 50శాతం సామర్థ్యంతోనే నడుస్తాయి. ఆటోలు, ట్యాక్సీల్లో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
  • వివాహాలు, అంత్యక్రియలకు 20మందికి మాత్రమే అనుమతి
  • స్పా, జిమ్​లు మూసివేస్తారు.

కొవిడ్​ పాజిటివిటీ రేటు 0.5శాతాన్ని దాటితే ఎల్లో అలర్ట్​ జారీ చేస్తారు. ప్రస్తుతం అక్కడ పాజిటివిటీ రేటు 0.68శాతంగా ఉంది.

Covid restrictions in Delhi today: దిల్లీలో కేసులు పెరుగుతున్నా.. ఆక్సిజన్​, ఆసుపత్రుల్లో పడకలు, ఐసీయూల వినియోగం పెరగలేదు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు కేజ్రీవాల్​ ఇప్పటికే స్పష్టం చేశారు.

మొత్తం 165 కేసులు..

దేశరాజధానిలో ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 165కు చేరింది. తాజాగా మరో 23మందికి కొత్త వేరియంట్​ సోకినట్టు నిర్ధరణ అయ్యింది.

ఇదీ చూడండి:- దేశంలో మరో 6,358 కరోనా కేసులు

Last Updated :Dec 28, 2021, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.