ETV Bharat / bharat

దేశంలో తగ్గిన కేసులు.. భారీగా పెరిగిన మరణాలు

author img

By

Published : Jan 29, 2022, 9:13 AM IST

india cases
భారత్​లో కొవిడ్ కేసులు

Covid cases in India: భారత్​లో కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం మరో 2,35,532మందికి కొవిడ్ వైరస్​ సోకింది. ఒక్కరోజులో 871 మంది మరణించారు. 3,35,939 మంది కొవిడ్​ను జయించారు. దేశంలో పాజిటివిటీ రేటు 13.39 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Corona cases in India: భారత్​లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులో.. 2,35,532 కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. మరణాల సంఖ్య పెరిగింది. వైరస్​తో మరో 871 మంది మరణించారు. 3,35,939 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 4,08,58,241
  • మొత్తం మరణాలు: 4,93,198‬
  • యాక్టివ్ కేసులు: 20,04,333
  • మొత్తం కోలుకున్నవారు: 3,83,60,710

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 56,72,766 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,65,04,87,260కు చేరింది.

అంతర్జాతీయంగా..

Corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 3,408,113మందికి కరోనా సోకింది. 10,324 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 370,189,281కి చేరగా.. మరణాల సంఖ్య 5,667,427కు పెరిగింది.

  • US Corona Cases: అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 522,300మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 2,732 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 75,271,402కోట్లు దాటింది.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 353,503కేసులు వెలుగుచూశాయి. మరో 263మంది చనిపోయారు.
  • ఇటలీలో 143,898కొత్త కేసులు బయటపడగా.. 378మంది మరణించారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 257,239 మందికి వైరస్​ సోకగా.. 779మంది చనిపోయారు.
  • అర్జెంటీనాలో తాజాగా 63,884 కరోనా కేసులు బయటపడగా.. 305మంది బలయ్యారు.
  • జర్మనీలో 189,464వేల మందికి వైరస్ సోకింది. మరో 179మంది మృతి చెందారు.
  • బ్రిటన్​లో మరో 89,176వేల మంది వైరస్ బారిన పడ్డారు.​ 277మంది మృతి చెందారు.
  • స్పెయిన్​లో తాజాగా 118,922 కేసులు బయటపడ్డాయి. మరో 199 మంది మరణించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యమంత్రి కీలక సూచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.