ETV Bharat / bharat

Covid cases in India: దేశంలో మరో 14,348 మందికి కరోనా

author img

By

Published : Oct 29, 2021, 9:32 AM IST

భారత్​లో కొత్తగా 14,348 కరోనా కేసులు (Covid cases in India) నమోదయ్యాయి. 805 మంది ప్రాణాలు కోల్పోగా.. 13,198 మంది వైరస్​ను జయించారు.

covid cases
దేశంలో కరోనా కేసులు

దేశంలో రోజువారి కరోనా కేసులు సంఖ్య తగ్గుదల (Coronavirus update) నమోదైంది. కొత్తగా 14,348 కరోనా కేసులు (Coronavirus update) వెలుగు చూశాయి. వైరస్​​ ధాటికి (Covid cases in India) మరో 805 మంది ప్రాణాలు కోల్పోగా.. 13,198 మంది కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 3,42,31,809
  • ‬మొత్తం మరణాలు: 4,57,191
  • మొత్తం కోలుకున్నవారు: 3,36,27,632
  • యాక్టివ్ కేసులు: 1,61,334

పరీక్షలు

దేశవ్యాప్తంగా గురువారం 12,84,552 మందికి కొవిడ్​ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు జరిపిన పరీక్షల సంఖ్య 60,57,82,957కు చేరినట్లు ఐసీఎంఆర్​ వెల్లడించింది.

టీకా పంపిణీ

టీకా పంపిణీకొత్తగా 74,33,392 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,04,82,00,966 కి చేరింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు..

ప్రపంచవ్యాప్తంగా (coronavirus worldwide) కొత్తగా 4,75,515 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కొవిడ్​​ ధాటికి మరో 7,855 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,62,46,206 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,95,925కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 78,460 మందికి వైరస్​ సోకగా.. మరో 1,208 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో కొత్తగా 40,096 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజే 1,159 మంది చనిపోయారు.
  • బ్రిటన్​లో కొత్తగా 39,842 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. 165 మంది మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 25,528 మంది వైరస్​ బారిన పడగా.. 229 మంది మరణించారు.
  • జర్మనీలో కొత్తగా మరో 26,610 మందికి కొవిడ్ సోకింది. 122 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి : కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్ కలకలం- ఏడుగురికి పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.