ETV Bharat / bharat

భారత్​లో కరోనా కలకలం.. కొత్తగా ఎన్ని కేసులంటే?

author img

By

Published : Jun 19, 2022, 9:40 AM IST

Updated : Jun 19, 2022, 11:23 AM IST

corona cases
కరోనా కేసులు

Covid cases in india: భారత్​లో కరోనా కేసులు తగ్గాయి. ఒక్కరోజే 12,899 మందికి వైరస్​ సోకింది. మరో 15 మంది చనిపోయారు. శనివారం ఒక్కరోజే 8,518 మంది కోలుకున్నారు.

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 12,899 మంది వైరస్​ బారినపడగా.. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,518 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.62 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.17 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.89 శాతం.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.50 శాతం వద్ద కొనసాగుతోంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,32,96,692
  • మొత్తం మరణాలు: 5,24,855
  • యాక్టివ్​ కేసులు: 72,474
  • కోలుకున్నవారి సంఖ్య: 4,26,99,363

Vaccination India: భారత్​లో శనివారం 13,24,591 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,96,14,88,807 కోట్లకు చేరింది. మరో 4,46,387 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు పెరిగాయి. ఒక్కరోజే 3,64,517 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 721 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 543,984,866కు చేరింది. మరణాల సంఖ్య 63,40,108కు చేరింది. ఒక్కరోజే 3,84,816 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 51,91,06,781గా ఉంది.

  • అమెరికాలో 12,749 కేసులు వెలుగుచూశాయి. 24 మందికిపైగా చనిపోయారు.
  • తైవాన్​లో మరో 53,707 కేసులు.. 181కుపైగా మరణాలు నమోదయ్యాయి.
  • జర్మనీలో 80,019 కేసులు బయటపడ్డాయి.
  • ఇటలీ ఒక్కరోజే 34,971 మంది కొవిడ్​ బారినపడగా.. 45 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఆస్ట్రేలియా​లో 26,927 కరోనా కేసులు, 64 మరణాలు నమోదయ్యాయి.

ఇదీ చూడండి : 'మహా'లో మరో 4వేల కేసులు.. మరణాలపై డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన!

Last Updated :Jun 19, 2022, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.