ETV Bharat / bharat

ముంబయిలో ఒక్కరోజే 20 వేలు దాటిన కరోనా కేసులు

author img

By

Published : Jan 6, 2022, 8:27 PM IST

Updated : Jan 6, 2022, 9:32 PM IST

Covid Cases in India: మహారాష్ట్రలో ఒక్కరోజే 36,265 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క ముంబయిలోనే కొత్తగా 20,181 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 1,14,847గా ఉంది. మరోవైపు బంగాల్​లో కొత్తగా 15,421 కరోనా కేసులు బయటపడ్డాయి.

covid cases
ముంబయిలో 20వేలు దాటిన కరోనా కేసులు

Covid Cases in Mumbai: దేశంలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ఆందోళకర స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో కొత్తగా 36,265 కేసులు నమోదయ్యాయి. 8,907 మంది కోలుకోగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాష్ట్రంలో 79 ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 79కి చేరింది. 381 మంది ఒమిక్రాన్​ నుంచి కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 1,14,847గా ఉంది.

ముంబయిలో కొత్తగా 20,181 కేసులు బయటపడ్డాయి. నాలుగు మరణాలు నమోదయ్యాయి. యాక్టివ్​ కేసుల సంఖ్య 79,260కు చేరింది. నగరంలోని ధారావిలో కొత్తగా 107 కేసులు వెలుగు చూశాయి.

  • దిల్లీలో కొత్తగా 15,097 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 15.34 శాతానికి చేరింది. వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో నగరంలోని ఆక్సిజన్ బెడ్స్​కు కూడా డిమాండ్​ పెరుగుతోంది. దిల్లీలో మొత్తం ఆక్సిజన్ బెడ్​ల సామర్థ్యం 12,104 కాగా.. 1,116 పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారు.
    Covid Cases in India
    దిల్లీలో ఏర్పాటు చేసిన 100 ఆక్సిజన్​ పడకలు
    Covid Cases in India
    'డాక్టర్స్​ ఫర్​ యూ' సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు
  • బంగాల్​లో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. 15,421 మందికి వైరస్​ సోకగా 7,343 మంది కోలుకున్నారు. 19 మంది మృతిచెందారు.
  • కేరళలో కొత్తగా 4649 మందికి కరోనా సోకింది. 2180 మంది కోలుకోగా.. 221 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 49,116కు చేరింది.
  • ఒడిశాలో కొత్తగా 1,897 కరోనా కేసులు బయటపడ్డాయి. వీరిలో 258 మంది చిన్నారులు ఉన్నారు. ఒక ఒమిక్రాన్​ మరణం నమోదైంది. భువనేశ్వర్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్​ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
  • హరియాణాలో 146 మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకింది. వీరిలో 87 మంది రెసిడెంట్​ డాక్టర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గత 10 రోజుల్లో 196 మంది ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొత్తగా 35 ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్​ కేసుల సంఖ్య 106కు చేరింది.

సీఎం, కేంద్రమంత్రికి కరోనా..

రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​కు​ కరోనా పాజిటివ్​ అని నిర్ధరణ అయింది. మరోవైపు కేంద్రమంత్రి నిత్యానంద్​ రాయ్​కు కూడా కరోనా సోకింది. తమకు కరోనా సోకినట్లు వారు ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

'నిబంధనలు ఉల్లంఘిస్తే ఓపెన్​ జైలుకే'

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మధ్యప్రదేశ్​లో ఆంక్షలు కట్టుదిట్టం చేసింది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. ఆంక్షలను మరింత కఠినం చేస్తోంది. కొవిడ్​ నిబంధనలను ఉల్లంఘించిన వారి కోసం 'ఓపెన్​ జైలు' ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని హోంమంత్రి నరోత్తమ్​ మిశ్రా అన్నారు. ప్రస్తుతం ఉన్న జరిమానాను పెంచే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కొత్తగా 1033 కరోనా కేసులు బయటపడ్డాయి.

కర్ణాటకలో నిబంధనలు..

కర్ణాటకలో ఇప్పటికే అమలులో ఉన్న రాత్రి కర్ఫ్యూను మరో రెండు వారాలకు పొడగించింది అక్కడి ప్రభుత్వం. వీటితో పాటు వారాంతపు కర్ఫ్యూను కూడా అమలులోకి తెచ్చింది. వాణిజ్య కేంద్రాలన్నీ 50 శాతం సామర్థ్యంతో పనిచేయాలని ఆదేశించింది.

హరియాణాలో..

హరియాణాలో కరోనా విజృంభిస్తున్న వేళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలను విధించింది ప్రభుత్వం. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్​లు, క్రీడా కేంద్రాలను ఈనెల 12 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కర్నల్​, పానీపత్​, కురుక్షేత్ర, యమునానగర్​, రోహ్​తక్​, ఝాజర్​లలో ఈ ఆంక్షలు అమలు కానున్నాయి.

రాష్ట్రంలో కొత్తగా 2176 కేసులు నమోదయ్యాయి.

కొవిడ్​ కంట్రోల్​ రూమ్స్​..

స్వీయ నిర్బంధంలో ఉన్న కరోనా రోగులకు సంబంధించి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కొవిడ్​ కంట్రోల్​ రూమ్స్​ రోజువారి నివేదికలు సమర్పించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.

Covid Cases in India
కరోనా సోకిన వైద్యులను పరామర్శించిన కేంద్రమంత్రి మన్​సుఖ్​ మాండవీయ
Covid Cases in India
వైద్యురాలితో మాట్లాడుతున్న కేంద్రమంత్రి
Covid Cases in India
వైరస్​ నుంచి వైద్యులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్న కేంద్ర మంత్రి

ఇదీ చూడండి : 'డేరా బాబాకు 3,500 మందితో భద్రతా? ఆయనేమైనా ప్రధాన మంత్రా?'

Last Updated : Jan 6, 2022, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.