ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- పెరిగిన మరణాలు

author img

By

Published : Jan 28, 2022, 9:12 AM IST

Updated : Jan 28, 2022, 9:50 AM IST

Covid cases in India
దేశంలో కరోనా విలయం

Covid cases in India: భారత్​లో మరో 2,51,209 మందికి కొవిడ్ వైరస్​ సోకింది. ఒక్కరోజులో 627 మంది మరణించారు. 3,47,443 మంది కొవిడ్​ను జయించారు. దేశంలో పాజిటివిటీ రేటు 15.88 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Corona cases in India: భారత్​లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. 24 గంటల వ్యవధిలో.. 2,51,209 కేసులు నమోదయ్యాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే. వైరస్​తో మరో 627 మంది మరణించారు. 3,47,443 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 15.88 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

  • మొత్తం కేసులు: 4,06,22,709‬
  • మొత్తం మరణాలు: 4,92,327‬
  • యాక్టివ్ కేసులు: 21,05,611
  • మొత్తం కోలుకున్నవారు:3,80,24,771

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 57,35,692 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,64,44,73,216కు చేరింది.

అంతర్జాతీయంగా..

Corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 35,49,909 మందికి కరోనా సోకింది. 10,240 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 36,66,30,735కు చేరగా.. మరణాల సంఖ్య 5,656,125కు పెరిగింది.

  • US Corona Cases: అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 497,351 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. 2,689మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7,46,95,333 కోట్లు దాటింది.
  • ఫ్రాన్స్​లో ఒక్కరోజే 3,92,168 కేసులు వెలుగుచూశాయి. మరో 268మంది చనిపోయారు.
  • ఇటలీలో 155,697కొత్త కేసులు బయటపడగా.. 389మంది మరణించారు.
  • బ్రెజిల్​లో కొత్తగా 2,19,878 మందికి వైరస్​ సోకగా.. 662మంది చనిపోయారు.
  • అర్జెంటీనాలో తాజాగా 77,729 కరోనా కేసులు బయటపడగా.. 333మంది బలయ్యారు.
  • జర్మనీలో 189,363వేల మందికి వైరస్ సోకింది. మరో 182మంది మృతి చెందారు.
  • బ్రిటన్​లో మరో 96,871వేల మంది వైరస్ బారిన పడ్డారు.​ 338మంది మృతి చెందారు.
  • స్పెయిన్​లో తాజాగా 130,888 కేసులు బయటపడ్డాయి. మరో 176 మంది మరణించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: మహారాష్ట్ర, కర్ణాటకలో శాంతించిన కరోనా.. కేరళలో వైరస్​ ఉద్ధృతి​

Last Updated :Jan 28, 2022, 9:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.