ETV Bharat / bharat

Covid cases in India: దేశంలో తగ్గిన కరోనా కేసులు- 8,503 మందికి వైరస్​

author img

By

Published : Dec 10, 2021, 10:11 AM IST

Covid cases in India
Covid cases in India

Covid cases in India: భారత్​లో తాజాగా 8,503 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. కరోనా​ ధాటికి మరో 624 మంది మృతి చెందారు. ఒక్కరోజే 7,678 మంది వైరస్​ను జయించారు.

Covid cases in India: దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఒక్కరోజే 8,503 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. వైరస్​​ ధాటికి మరో 624 మంది మరణించారు. తాజాగా 7,678 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 34,674,744
  • మొత్తం మరణాలు: 4,74,735
  • యాక్టివ్​ కేసులు: 94,943
  • మొత్తం కోలుకున్నవారు: 3,41,05,066

Vaccination in India:

గురువారం ఒక్కరోజే 74,57,970 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,31,18,87,257 కు చేరినట్లు చెప్పింది.

Coronavirus worldwide:

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజే 6,04,517 మందికి కొవిడ్​ సోకింది. మరో 7,093 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 26,87,40,130కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 53,02,617కు పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు.. మరణాలు

  • అమెరికాలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 1,10,894 మందికి కొవిడ్​ సొకినట్లు తేలింది. మరో 1,088 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 56,854 మంది కొవిడ్​ బారిన పడ్డారు. మరో 136 మంది మరణించారు.
  • బ్రిటన్​లో తాజాగా 50,867 మందికి వైరస్​ సోకింది. మరో 148 మంది మృతి చెందారు.
  • రష్యాలో ఒక్కరోజే 30,209 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 1,181 చనిపోయారు.
  • పోలాండ్​లో తాజాగా 27,458 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. మరో 562 మంది మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 19,696 మందికి కరోనా నిర్ధరణ కాగా.. 195 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో ఒక్కరోజే 16,295 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 78 మంది మరణించారు.

ఇదీ చూడండి: టీకా నిల్వలతోనే కరోనా కొనసాగింపు.. డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.