ETV Bharat / bharat

మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?

author img

By

Published : Jul 21, 2022, 9:34 AM IST

covid cases in india
కొవిడ్ కేసులు

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 21,566 మంది వైరస్ బారిన పడగా.. 45 మంది ప్రాణాలు కోల్పోయారు.

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం మధ్య 21,566 మంది వైరస్​ బారినపడగా.. మరో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి తాజాగా 18,294 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.47 శాతానికి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.25గా ఉంది.

  • మొత్తం కేసులు : 4,38,25,185
  • మొత్తం మరణాలు: 5,25,870
  • యాక్టివ్​ కేసులు: 1,48,881
  • కోలుకున్నవారి సంఖ్య: 4,31,50,434

Vaccination India: భారత్​లో బుధవారం 29,12,855 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 200.91 కోట్లు దాటింది. మరో 5,07,360 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 9,71,390 మంది వైరస్​ బారినపడగా.. మరో 2,015 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 57,11,73,227కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 63,95,685 మంది మరణించారు. ఒక్కరోజే 7,97,256మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 54,15,41,150కు చేరింది. ఫ్రాన్స్​లో కొత్తగా 89,982 మందికి కరోనా సోకింది. 125 మంది మరణించారు.

  • జర్మనీలో కరోనా ఉద్ధృతి పెరిగింది. కొత్తగా 1,36,624 మందికి వైరస్ సోకింది. 177 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • అమెరికాలో తాజాగా 1,13,588 మందికి వైరస్​ సోకగా.. 367 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 89,982 మందికి కరోనా సోకింది. 125 మంది మరణించారు.
  • ఇటలీలో కొత్తగా 86,067 మందికి వైరస్​ సోకగా.. 157 మంది మరణించారు.
  • జపాన్​లో 81,362 కేసులు నమోదు కాగా.. 33 మంది మరణించారు.

ఇవీ చూడండి : చాక్లెట్​ తిని ఆరేళ్ల బాలిక మృతి.. ఏం జరిగిందంటే?

యోగి కేబినెట్‌లో కలకలం.. మంత్రి రాజీనామా.. మరొకరు దిల్లీకి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.