ETV Bharat / bharat

దేశంలో తగ్గని కొవిడ్ ఉద్ధృతి.. అమెరికాలో లక్ష, జపాన్​లో 2 లక్షల కేసులు

author img

By

Published : Jul 30, 2022, 10:07 AM IST

covid cases in india
కరోనా కేసులు

Covid Cases In India: భారత్​లో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 20,408 మంది వైరస్ బారిన పడగా.. 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు జపాన్​లో కొత్తగా 2.30 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

Covid Cases in India: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం మధ్య 20,408 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి 20,958 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.48 శాతానికి చేరింది.

  • మొత్తం కేసులు : 4,40,00,138
  • మొత్తం మరణాలు: 5,26,312
  • యాక్టివ్​ కేసులు: 1,43,384
  • కోలుకున్నవారి సంఖ్య: 4,33,30,442

Vaccination India: భారత్​లో శుక్రవారం 33,87,173 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 203.94 కోట్లు దాటింది. మరో 4,04,399 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 8,36,173 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,917 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,07,00,946కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,17,323 మంది మరణించారు. ఒక్కరోజే 8,62,421 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 55,06,76,713కు చేరింది.

  • జపాన్​లో 2,30,055 కేసులు నమోదు కాగా.. 116 మంది మరణించారు.
  • అమెరికాలో తాజాగా 99,061 కేసులు నమోదు కాగా.. 286 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దక్షిణ కొరియాలో కొత్తగా 85,275 మందికి కరోనా సోకింది. 35 మంది బలయ్యారు.
  • ఇటలీలో తాజాగా 54,088 మందికి కరోనా సోకింది. 244 మంది మరణించారు.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 45,515 మందికి వైరస్​ సోకగా.. 89 మంది మరణించారు.

ఇదీ చూడండి : బలమైన ప్రభుత్వమంటే నియంత్రించడం కాదు: మోదీ

జస్టిస్‌ ఖాన్విల్కర్‌ కష్టపడేతత్వానికి మారుపేరు: సీజేఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.