ETV Bharat / bharat

తగ్గిన కరోనా వ్యాప్తి.. 15వేల దిగువకు కేసులు.. తగ్గిన మరణాలు

author img

By

Published : Jul 26, 2022, 10:11 AM IST

కరోనా కేసులు
కరోనా కేసులు

Covid Cases In India: భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 14,830 మంది వైరస్ బారిన పడగా.. 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా భారీగా కేసులు నమోదయయ్యాయి. అత్యధికంగా జపాన్​లో ఒక్కరోజే 1.72 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు.

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం మధ్య 14,830 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్​ నుంచి 18,159 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.47 శాతానికి చేరింది.

  • మొత్తం కేసులు : 4,39,20,471‬
  • మొత్తం మరణాలు: 5,26,110
  • యాక్టివ్​ కేసులు: 1,47,512
  • కోలుకున్నవారి సంఖ్య: 4,32,46,829

Vaccination India: భారత్​లో సోమవారం 30,42,476 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,02,50,57,717 కోట్లు దాటింది. మరో 4,26,102 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచదేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 6,75,085 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,337 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 575,881,194కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 6,404,942 మంది మరణించారు. ఒక్కరోజే 9,64,127 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 54,57,30,530కు చేరింది.

  • జపాన్​లో 1,72,673 కేసులు నమోదు కాగా.. 33 మంది మరణించారు.
  • అమెరికాలో తాజాగా 52,830 కేసులు నమోదు కాగా.. 117 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో కొత్తగా 1,45,474 మందికి వైరస్​ సోకగా.. 187 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో కొత్తగా 35,883 మందికి కరోనా సోకింది. 17 మంది బలయ్యారు.
  • ఆస్ట్రేలియాలో తాజాగా 36,507 మందికి వైరస్​ సోకగా.. 32 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి : పువ్వుల కోసం వెళ్లి బావిలో శవంగా తేలిన బాలిక.. కుక్కలే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.