దేశంలో పెరిగిన కొవిడ్ కేసులు.. 27 మంది మృతి.. జపాన్​లో వ్యాప్తి తగ్గుముఖం!

author img

By

Published : Sep 7, 2022, 9:22 AM IST

కరోనా కేసులు

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 5,379 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజులో 7,094 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Corona Cases in India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 5,379 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 7,094 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.7కు పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.11 శాతానికి పడిపోయాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,44,72,241
  • క్రియాశీల కేసులు: 50,594
  • మొత్తం మరణాలు: 5,28,030
  • కోలుకున్నవారు: 4,38,93,590

Vaccination In India :
దేశంలో మంగళవారం 18,81,319 కోట్ల మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 213.91 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,21,917 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases :
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 486,032 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,413 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 610,613,899 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 6,506,895 మంది మరణించారు. మంగళవారం మరో 753,584 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 588,727,760కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 84,295 కేసులు వెలుగుచూశాయి. మరో 239 మందికిపైగా మరణించారు.
  • జర్మనీలో 46,495 కొవిడ్​ కేసులు, 120 మరణాలు నమోదయ్యాయి.
  • రష్యాలో 38,500 కొత్త కేసులు, 95 మరణాలు వెలుగుచూశాయి.
  • దక్షిణ కొరియా, అమెరికా, తైవాన్, ఇటలీ, ఫ్రాన్స్, హాంకాంగ్, బ్రెజిల్​​లోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి

ఇవీ చదవండి: అకస్మాత్తుగా రోగికి గుండెపోటు.. సీపీఆర్​తో ప్రాణాలు కాపాడిన డాక్టర్​.. వీడియో వైరల్

గుండెపోటుతో కర్ణాటక మంత్రి హఠ్మానరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.