ETV Bharat / bharat

కేరళలో మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. దిల్లీలో 6నెలల గరిష్ఠానికి మరణాలు

author img

By

Published : Jan 22, 2022, 8:48 PM IST

Updated : Jan 22, 2022, 9:39 PM IST

Corona cases in India
కేరళలో మళ్లీ పెరిగిన కొత్త కేసులు

Corona Cases in India: పలు రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసుల్లో భారీగా పెరుగుదల నమోదైంది. కేరళలో 45వేల కేసులు వెలుగుచూశాయి. దిల్లీలో మరో 11వేల మందికి వైరస్​ సోకింది. మాజీ ప్రధాని దేవెగౌడ రెండోసారి కరోనా బారినపడ్డారు. మణిపాల్​లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో మరో 46 వేల కొత్త కేసులు వెలుగుచూశాయి.

Corona Cases in India: దేశంలో రోజువారీ కరోనా కేసులు సంఖ్య భారీగానే నమోదవుతోంది. కేరళలో శనివారం కొత్తగా 45,136 మందికి వైరస్​ సోకింది. శుక్రవారంతో పోలిస్తే కొత్త కేసులు 3వేలకుపైగా అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 55,74,702కు చేరింది. మరో 132 మంది మరణించారు. అందులో 70 కేసులు సవరించిన మార్గదర్శకాల ప్రకారం వచ్చినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

దిల్లీలో..

దేశ రాజధాని దిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం మరో 11,486 మందికి పాజిటివ్​గా తేలింది. 45 మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్​ 5 తర్వాత అత్యధిక మరణాలు ఇవేనని ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 14,802 మంది కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 16.16శాతంగా ఉంది.

మాజీ ప్రధాని దేవెగౌడకు రెండోసారి కరోనా

జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ మరోసారి కరోనా బారినపడ్డారు. తాజాగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినప్పటికీ లక్షణాలేమీ లేవని సమాచారం. అయితే, ఆయన్ను మణిపాల్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆయన సతీమణి చెన్నమ్మకు నెగెటివ్‌ వచ్చింది. ఆమె ఇంట్లోనే ఉన్నారు. గతేడాది మార్చిలో దేవెగౌడ, ఆయన సతీమణి కొవిడ్‌ బారినపడ్డారు. మరోవైపు, దేవెగౌడ త్వరగా కోలుకోవాలంటూ కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ఆకాంక్షించారు. మాజీ ప్రధాని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కర్ణాటక ఆరోగ్యమంత్రి డాక్టర్‌ కె.సుధాకర్‌ ట్వీట్‌ చేశారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు.

గుజరాత్​లో రాత్రి కర్ఫ్యూ..

గుజరాత్​లో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. వైరస్​ కట్టడి చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఉన్న నగరాలతో పాటు వైరస్​ ఉద్ధృతి పెరుగుతున్న మరో 17 పట్టణాలకు ఈ ఆంక్షలు విస్తరిస్తున్నట్లు తెలిపింది.

యూపీలో జనవరి 30 వరకు విద్యాసంస్థల మూసివేత

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలతో పాటు అన్ని విద్యాసంస్థలను ఈనెల 30 వరకు మూసివేస్తున్నట్లు తెలిపింది యోగి ప్రభుత్వం. ఆన్​లైన్​ తరగతులు కొనసాగుతాయని పేర్కొంది. అంతకు ముందు జనవరి 23 వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా పొడిగించింది.

వివిధ రాష్ట్రాల్లో శనివారం నమోదైన కేసుల వివరాలు..

రాష్ట్రంకొత్త కేసులుమరణాలు
మహారాష్ట్ర46,393 48
కర్ణాటక42,470 26
తమిళనాడు30,744 33
గుజరాత్23,150 15
ఆంధ్రప్రదేశ్​12,9266
మధ్యప్రదేశ్11,2745
బంగాల్​9,1917
ఒడిశా8,8457
జమ్ముకశ్మీర్​6,5687
ఛత్తీస్​గఢ్5,661 11
పుదుచ్చేరి2,4463
ఝార్ఖండ్2,0159
హిమాచల్​ప్రదేశ్​ 2,216 6
అరుణాచల్​ ప్రదేశ్ 5320

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. ఒమిక్రాన్​@10000​

Last Updated :Jan 22, 2022, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.