ETV Bharat / bharat

'కాంగ్రెస్‌ బాగుపడాలంటే శస్త్రచికిత్స అవసరం'

author img

By

Published : Jun 10, 2021, 3:07 PM IST

veerappa moily on congress
కాంగ్రెస్​పై వీరప్ప మొయిలీ వ్యాఖ్యలు

కాంగ్రెస్​ బాగుపడాలంటే శస్త్రచికిత్స అవసరమని ఆ పార్టీ సీనియర్​ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. సైద్ధాంతిక నిబద్ధత ఉన్న వ్యక్తులనే అధిష్ఠానం ప్రోత్సహించాలని తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సరైన ప్రదర్శన ఇవ్వకపోతే.. 2024 సార్వత్రికంలో కాంగ్రెస్ పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

మాజీ కేంద్ర మంత్రి జితిన్​ ప్రసాద.. కాంగ్రెస్​ను వీడి భాజపాలో చేరిన నేపథ్యంలో కాంగ్రెస్​ సీనియర్ ​నేత వీరప్ప మొయిలీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ బాగుపడాలంటే పార్టీకి శస్త్రచికిత్స అవసరమని పేర్కొన్నారు. వారసత్వాన్ని మాత్రమే కాంగ్రెస్​ నమ్ముకోకూడదన్న ఆయన.. రాజకీయాల్లో పోటీతత్వాన్ని కాంగ్రెస్​ అలవరుచుకోవాలని అభిప్రాయపడ్డారు. సైద్ధాంతిక నిబద్ధత ఉన్న నేతలనే అధిష్ఠానం ప్రోత్సహించాలని కోరారు. జితిన్ ప్రసాద నిబద్ధతపై మొదటి నుంచీ అనుమానాలే ఉన్నాయన్నారు.

"సరైన స్థానాల్లో సరైన వ్యక్తుల్ని నియమించి పార్టీని పునవ్యవస్థీకరించాలి. అసమర్థులైన వ్యక్తులకు కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టకూడదు. కాంగ్రెస్​కు ఇది ఓ పాఠం. పార్టీలో ఉన్న లోటుపాట్లను కాంగ్రెస్​ పునరాలోచించుకుని సరైన వ్యూహాన్ని అమలు చేస్తేనే పునర్​వైభవం సాధించగలుగుతుంది."

-వీరప్ప మొయిలీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత

వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని.. వాటిలో కాంగ్రెస్​ సరైన ప్రదర్శన ఇవ్వకపోతే.. 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని చెప్పారు.

ఇదీ చూడండి: Lakshadweep: లక్షదీవుల్లో అశాంతి అభద్రతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.