ETV Bharat / bharat

గుడ్డు పెంకులే కాన్వాస్- అద్భుత చిత్రాలకు కేరాఫ్!

author img

By

Published : Jul 3, 2021, 9:55 PM IST

eggs, TN
కోడిగుడ్డు పెంకులు, ఆర్టిస్ట్

కొందరు కాన్వాస్​పై అద్భుతంగా చిత్రాలు గీస్తుంటారు. మరికొందరు చెక్కలతో, సుద్దముక్కలతో కళాకృతులు చేస్తుంటారు. కానీ.. ఓ కుర్రాడు వినూత్నంగా ఆలోచించాడు. కోడిగుడ్డు పెంకులపై అద్భుతంగా కార్టూన్​ చిత్రాలు గీసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

కోడిగుడ్డు పెంకుపై అద్భుత చిత్రాలు

కోడిగుడ్డు పెంకులను కాన్వాస్​లా మార్చాడు తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ఓ 11 ఏళ్ల కుర్రాడు. గుడ్డు పెంకులపై అద్భుతమైన కార్టూన్ చిత్రాలను గీసి అందరినీ ఆశ్యర్యపరుస్తున్నాడు.

egg shells
గుడ్డుపెంకుపై డోరెమాన్ చిత్రం

"లాక్​డౌన్​ సమయంలో ఇంటిదగ్గరే ఉండటం చాలా బోర్​ కొట్టేది. ఈ క్రమంలో నాకు ఓ ఆలోచన వచ్చింది. కోడిగుడ్డు తిని వాటి పెంకులను పారేయకుండా కొత్తగా ఏమైనా చేయాలి అనుకున్నాను. ఆపై పెంకులపై బొమ్మలు గీస్తే బాగుంటుందనిపించింది. ఇప్పటివరకు 100కుపైగా చిత్రాలను గీశాను."

-సంజయ్, చిత్రకారుడు

కార్టూన్​ బొమ్మలు గీసి వాటికి రంగులు కూడా వేశాడు సంజయ్. చిన్నపిల్లలకు నచ్చే.. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, మిక్కీమౌస్, బ్యాట్​మ్యాన్ మొదలైన చిత్రాలను గీసినట్లు సంజయ్ చెబుతున్నాడు.

egg shells
బొమ్మగీస్తూ..
egg shells
చిత్రకారుడు సంజయ్

ఇదీ చదవండి:పాదాలతోనే అద్భుత చిత్రాలు.. దివ్యాంగుడి ప్రతిభ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.