ETV Bharat / bharat

ఖుష్బూకు తృటిలో తప్పిన ప్రమాదం

author img

By

Published : Nov 18, 2020, 11:21 AM IST

Updated : Nov 18, 2020, 11:50 AM IST

సినీనటి, భాజపా నాయకురాలు ఖుష్బూకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ట్యాంకర్‌ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్‌బెలూన్స్‌ తెరుచుకోవడంతో ఆమె సురక్షితంగా బయటపడ్డారు.

Close shave for BJP's Khushbu as tanker rams into her car
నటి కుష్భు కారుకు ప్రమాదం

సినీ నటి, భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్‌కు ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారును ట్యాంకర్‌ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులోని ఎయిర్‌బెలూన్స్‌ తెరుచుకోవడంతో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయం గురించి తెలియజేస్తూ ఖుష్బూ తాజాగా ఓ ట్వీట్‌ పెట్టారు.

  • Met with an accident near Melmarvathur..a tanker rammed into us.With your blessings and God's grace I am safe. Will continue my journey towards Cuddalore to participate in #VelYaatrai #Police are investigating the case. #LordMurugan has saved us. My husband's trust in him is seen pic.twitter.com/XvzWZVB8XR

    — KhushbuSundar ❤️ (@khushsundar) November 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

‘కడలూరు వెళ్తుండగా మార్గమధ్యంలో మెల్మర్వతూర్‌ వద్ద మేం ప్రయాణిస్తున్న కారుని ట్యాంకర్‌ ఢీ కొట్టింది. దేవుడి దయ వల్ల సురక్షితంగా బయటపడ్డాం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు’ అని ఖుష్బూ పేర్కొన్నారు. కారులో ఎవరెవరు ప్రయాణిస్తున్నారన్న వివరాలు తెలియరాలేదు.

Close shave for BJP's Khushbu as tanker rams into her car
ప్రమాదానికి గురైన కారులో ఖుష్బూ
Close shave for BJP's Khushbu as tanker rams into her car
ప్రమాదానికి గురైన కారు నుంచి దిగుతున్న ఖుష్బూ

ఇదీ చూడండి: కారు ప్రమాదంలో నలుగురు సజీవదహనం

Last Updated : Nov 18, 2020, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.