ETV Bharat / bharat

ముక్కలుగా నరికి మహిళ దారుణ హత్య.. హైవే పక్కన శరీరభాగాలు.. చిన్నారికి జన్మనిచ్చిన మైనర్

author img

By

Published : Dec 14, 2022, 4:58 PM IST

Updated : Dec 14, 2022, 7:39 PM IST

హరియాణాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. దిల్లీ- జైపుర్​ జాతీయ రహదారి పక్కన ఓ మహిళ మృతదేహం.. ముక్కలుగా పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. మరో ఘటనలో ఓ యువకుడు ఓ బాలికను ప్రేమ పేరు చెప్పి.. తల్లిని చేశాడు. ఇది మహారాాష్ట్ర​​లో వెలుగుచూసింది.

minor girl gave birth to a baby
minor girl gave birth to a baby

హరియాణాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. గుర్తుతెలియని హంతకులు ఓ మహిళను చంపి.. ముక్కలుగా చేసి జాతీయ రహదారి పక్కన పడేశారు. దాదాపు 10 రోజుల క్రితం ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు నమోదుచేసుకొని విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.

అసలు ఏం జరిగిందంటే..?
రేవాడీ జిల్లా అస్​లావాస్​ గ్రామానికి చెందిన రామ్​పాల్ అనే రైతు మంగళవారం రాత్రి 9గంటల సమయంలో కసోలా ప్రాంతంలోని.. దిల్లీ- జైపుర్​ జాతీయ రహదారికి పక్కన ఉండే తన పొలానికి వెళ్లాడు. అక్కడ ఓ మహిళ శరీర భాగాలు విడిగా పడి ఉండడాన్ని గుర్తించాడు. ముందుగా రామ్​పాల్​కు తల, మొండెం కనిపించాయి. అనంతరం కొద్ది దూరంలో ఒక ట్రాలీ బ్యాగ్ చుట్టూ కుక్కలు గుంపుగా ఉండడాన్ని గమనించాడు. దీంతో ఆ బ్యాగ్​ని పరీక్షించగా.. దాని నుంచి చెడు వాసన రావడం గుర్తించాడు. వెంటనే రామ్​పాల్​ ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న శరీర భాగాలను.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్య జరిగి దాదాపు 10 రోజులు అయి ఉండొచ్చని భావిస్తున్నారు. హంతకుడు సాక్ష్యాదారాలను మాయం చేయడానికే ఇలా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని.. నిందితులు కోసం గాలిస్తున్నట్లు కసోలా స్టేషన్​ ఇన్​ఛార్జ్​ మనోజ్​ కడియాన్​ తెలిపారు.

బిడ్డకు జన్మనిచ్చిన మైనర్​..
మహారాష్ట్ర​లో ఓ యువకుడు ఓ మైనర్​ను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తల్లిని చేశాడు. దీంతో ఆ బాలిక డిసెంబర్​ 8న ఓ చిన్నారికి జన్మనిచ్చింది. ముంబయిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

యావత్​మాల ప్రాంతంలో నికేశ్​ సేసారావు అనే యువకుడు ప్రేమ పేరుతో మయమాటలు చెప్పి ఓ మైనర్​కు దగ్గరయ్యాడు. 2022 మార్చి నుంచి ఆమెతో శరీరక సంబంధం పెట్టుకున్నాడు. బాలిక ప్రేమ వ్యవహారాన్ని కుటుంబసభ్యులు గుర్తించి.. అతనితో మాట్లాడవద్దని హెచ్చరించారు. దాంతో బాలిక.. నికేశ్​తో మాట్లాడడం మానేసింది. కానీ అప్పటికే బాలిక గర్భం దాల్చింది. అయితే, బాలిక సాధారణంగానే ఉండడం, తన పనులు తానే చేసుకుంటుండటం వల్ల.. ఆమె గర్భవతి అన్న విషయాన్ని కుటుంబసభ్యులు గుర్తించలేకపోయారు. దీంతో బాలిక డిసెంబర్​ 8న ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఓ చిన్నారికి జన్మనిచ్చింది. దీనిపై బాలిక కుటుంబసభ్యులు నికేశ్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 23ఏళ్ల నికేశ్​పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ఆవుపై అత్యాచారం చేసిన మైనర్​..
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మైనర్​.. మూగజీవిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ వికృత ఘటన పుణెలో వెలుగుచూసింది. దీంతో పోలీసులు ఆ మైనర్​ను అరెస్ట్​ చేశారు. కైపుణ్య ప్రాంతం ఫుర్​సింగ్​ గ్రామంలోని.. గణపతి ఆలయానికి పక్కన ఈ దారుణం జరిగింది. 16 ఏళ్ల ఓ యువకుడు పంటపొలంలో ఆవు కాళ్లను తాళ్లతో కట్టి అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలుసుకొన్న హడప్​సర్​ పోలీసులు అతడిని.. జంతు హింస కేసులో అరెస్ట్​ చేశారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు పెద్ద ఎత్తున ఆదోళనలు చేపట్టారు.

రేబిస్​తో మృతి చెందిన బాలుడు..
ఉత్తర్​ప్రదేశ్​లో ఓ బాలుడు కుక్కకాటుకు గురై మృత్యువాత పడ్డాడు. కొన్ని రోజుల క్రితం ఆగ్రాలోని రుద్​మౌలీ ప్రాంతంలో.. అరవింద్​ బహదురియా అనే వ్యక్తి కుమారుడు 8 ఏళ్ల నైతిక్​కు​ ఓ వీధి కుక్క కరిచింది. ఈ విషయాన్ని నైతిక్​ ఇంట్లో చెప్పలేదు. కుక్కకాటుకు గురైన తర్వాత.. నుంచి నైతిక్​ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కుటుంబసభ్యులకు.. నైతిక్​ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు. దాదాపు నెలన్నర నుంచి అతని ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. కొద్దిరోజులకు కుక్కలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో కుటుంబసభ్యులు నైతిక్​ను ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే నైతిక్​ శరీరం మొత్తం రేబిస్​ వ్యాపించిందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నైతిక్​ సోమవారం మృతి చెందాడు. నైతిక్​ మృతితో కుటుంబసభ్యులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. రుద్​మౌలీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా వీధి కుక్కలు ఉన్నాయని.. వాటి కారణంగా చాలా మంది కుక్క కాటుకు గురవుతున్నట్లు స్థానికులు వాపోయారు.

Last Updated :Dec 14, 2022, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.