ETV Bharat / bharat

China India Border Issue Rahul : 'చైనా సరిహద్దుపై కేంద్రం అబద్దాలు'.. మోదీపై రాహుల్​, ఓవైసీ ఫైర్​.. బీజేపీ స్ట్రాంగ్​ రిప్లై

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 7:17 PM IST

Updated : Aug 26, 2023, 7:31 AM IST

china-india-border-issue-rahul-gandhi-comments-and-bjp-reply-to-rahul-on-china-border-issue
భారత్​ చైనా సరిహద్దు సమస్య వివాదం

China India Border Issue Rahul : మోదీ, జిన్​పింగ్​ సంభాషణపై చైనా అసత్య ప్రచారానికి తెరలేపింది. భారత్​ కోరిక మేరకే మోదీతో జిన్​పింగ్ మాట్లాడినట్లు తెలిపింది. ఈ వాదనకు భారత్ గట్టిగా బదులిచ్చింది. ఈ అంశంపై అసదుద్దీన్​​ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కార్గిల్ సభలోనూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది.

China India Border Issue Rahul : దక్షిణాఫ్రికాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ మధ్య బుధవారం జరిగిన సంభాషణపై చైనా వింత వాదన ఎత్తుకుంది. భారత్​ కోరిక మేరకే మోదీతో జిన్​పింగ్ మాట్లాడినట్లు తెలిపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్​.. చైనా వాదనను కొట్టిపారేసింది. అదంతా అసత్య ప్రచారమని కుండబద్దలు కొట్టింది.

దీనిపై గురువారం భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వివరణ ఇచ్చారు. బ్రిక్​ సమావేశాల సందర్భంగా మోదీ, జిన్​పింగ్ కాసేపు మాట్లాడుకున్నారని ఆయన తెలిపారు. తూర్పు లద్ధాఖ్​లోని ఎల్​ఏసీ వద్ద సరిహద్దు సమస్యలపై భారత్​ ఆందోళన చెందిందని వివరించారు. సరిహద్దుల్లో శాంతి అవసరమని భారత్​ నొక్కి చెప్పిందన్న వినయ్ క్వాత్రా.. చైనాయే భారత్​తో దైపాక్షిక చర్చల కోసం అభ్యర్థించిందని పేర్కొన్నారు.

Asaduddin Owaisi Fire On Modi : అయితే చైనా ఆరోపణల ఆధారంగా చేసుకుని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్​​ ఓవైసీ.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. "మోదీ.. చైనా అధ్యక్షుడితో మాట్లాడాలి అనుకుంటున్నారని ఆ దేశ విదేశాంగ మంత్రి చెప్పారు. మన విదేశాంగ కార్యదర్శి మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. జిన్​పింగ్​ వెంట మోదీ ఎందుకు పడుతున్నారు? చైనా చూపే పరిష్కారాన్ని అంగీకరించాలని ఆర్మీపై ఎందుకు మోదీ ఒత్తిడి తెస్తున్నారు? చైనా దళాలకు మోదీ ఎందుకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు?" అని ఓవైసీ ప్రశ్నించారు. 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఆయన ఆరోపించారు. దీనిపై చర్చ జరిపేందుకు పార్లమెంట్​ను ప్రత్యేకంగా సమావేశపరచాలని డిమాండ్​ చేశారు. చైనా విషయంలో బీజేపీ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీ, జిన్​పింగ్​ సంభాషణ వేళ.. రాహుల్​ గాంధీ కీలక వ్యాఖ్యలు..
China India Border Issue Rahul Gandhi Comments On Modi : ఈ నేపథ్యంలోనే చైనాతో సరిహద్దు వివాదంలో కేంద్రం వైఖరిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. వేలాది కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినా ప్రధానమంత్రి నిజం చెప్పడం లేదని విమర్శించారు. బ్రిక్స్‌ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సంభాషించుకున్న వేళ.. రాహుల్‌ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. లద్ధాఖ్‌ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ శుక్రవారం కార్గిల్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత రాహుల్‌ లద్ధాఖ్‌ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి.

"భారత్‌కు చెందిన వేలాది కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించింది. చింతించాల్సిన విషయం ఏమిటంటే భారత ప్రధాన మంత్రి విపక్షాలతో జరిగిన సమావేశంలో.. భారత్‌కు చెందిన భూభాగం ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాలేదని తెలిపారు. ఇది పచ్చి అబద్ధం. లద్ధాఖ్‌కు చెందిన ప్రతి వ్యక్తికి తెలుసు. లద్ధాఖ్‌కు చెందిన భూమిని భారత్‌ నుంచి చైనా ఆక్రమించుకుంది."

--రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

రాహుల్​ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ.. తమను చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్​కు హితవు..
BJP Reply to Rahul On China Border Issue : భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న రాహుల్​ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ కొట్టిపారేసింది. అవన్నీ నిరాధారణ ఆరోపణలని చెప్పింది. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్​ పార్టీయే చైనాతో సంబంధాలు కలిగి ఉండి.. చారిత్రకంగా క్షమించరాని నేరం చేసిందని మండిపడింది. బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. భారత మొదటి ప్రధాని జవహర్​లాల్​​ నెహ్రూ.. 1952లో చైనాకు 3,500 టన్నులు బియ్యాన్ని పంపించారని అన్నారు.

యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుదుర్చుకున్న ఒప్పంద పత్రాన్ని విడుదల చేయాలని త్రివేది డిమాండ్ చేశారు. మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం.. మిలటరీ, దౌత్య, ఆర్థిక సంబంధాలలో అపూర్వమైన విజయాలను అందుకుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ​ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దేశాన్ని బలహీన పరిచేందుకే ప్రయత్నించిందని త్రివేది ఆరోపించారు. చైనా, పాకిస్థాన్​ సంక్షోభంలో ఉన్నప్పుడు కాంగ్రెస్​ పార్టీ సాయం అందించిందన్న ఆయన.. బీజేపీని చూసి ఆ పార్టీ నేర్చుకోవాలని హితవు పలికారు.

Sharad Pawar Ajit Pawar : 'NCPలో చీలిక లేదు.. అజిత్​ మా నాయకుడే'.. శరద్​ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు

PM Degree Case : దిల్లీ సీఎం కేజ్రీవాల్​కు షాక్​.. ప్రధాని డిగ్రీ కేసులో సుప్రీం కీలక నిర్ణయం

Last Updated :Aug 26, 2023, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.