ETV Bharat / bharat

బోరుబావిలో పడిన చిన్నారి కథ సుఖాంతం

author img

By

Published : Jun 14, 2021, 5:22 PM IST

ఉత్తర్​ ప్రదేశ్​లో బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. సుమారు 9 గంటలపాటు శ్రమించి రక్షించాయి సహాయక బృందాలు.

4-yr old falls into Borewell
బోరుబావిలో బాలుడు

ఉత్తర్​ప్రదేశ్​ ఫతేబాద్​ జిల్లాలో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన నాలుగేళ్ల చిన్నారి కథ సుఖాంతమైంది. సుమారు 9 గంటల పాటు శ్రమించి బాలుడిని రక్షించాయి సహాయక బృందాలు. బోరుబావి నుంచి బయటపడిన బాలుడిని వెంటనే వైద్య పరీక్షలకు తరలించారు.

4-yr old falls into Borewell
బాలుడిని పరిశీలిస్తున్న వైద్య బృందం

ఇదీ జరిగింది..

జిల్లాలోని ధారియాయి గ్రామానికి చెందిన చోటేలాల్​ తన ఇంటి ముందు గతంలో బోరుబావిని తవ్వించాడు. దానికి అమర్చిన పైపులు రెండు రోజుల క్రితం తీసేశాడు. బోరు గుంతను అలాగే వదిలేశాడు. చోటేలాల్​ కుమారుడు శివ(4) ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. చిన్నారిని సురక్షితంగా బయటకు తీశాయి.

4-yr old falls into Borewell
సహాయక చర్యల్లో అధికారులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.