ETV Bharat / bharat

94 ఓట్ల తేడాతో ఓడిన ఉపముఖ్యమంత్రి- 16 ఓట్లతో బీజేపీ అభ్యర్థి విన్​- ఛత్తీస్​గఢ్​లో ఆసక్తికర ఫలితాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 10:40 AM IST

Chhattisgarh Election Results 2023
Chhattisgarh Election Results 2023

Chhattisgarh Election Results 2023 : ఛత్తీస్​గఢ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. ఉపముఖ్యమంత్రి టీఎస్​ సింగ్ దేవ్​ కేవలం 94 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరో బీజేపీ అభ్యర్థి 16 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.

Chhattisgarh Election Results 2023 : ఎగ్జిట్​ పోల్స్​ను తారుమారు చేస్తూ సాగిన ఛత్తీస్​గఢ్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. ఓ బీజేపీ అభ్యర్థి కేవలం 16 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుత ఉపముఖ్యమంత్రి టీఎస్​ సింగ్ దేవ్​ కేవలం 94 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈయనే కాకుండా ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న అనేక మంది మంత్రులు సైతం ఓటమిని చవిచూశారు. 13 మందితో కూడిన మంత్రివర్గంలో 9 మంది పరాజయం పాలయ్యారు.

  • కాంకేర్​ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఆశారామ్​ నేతమ్​ కేవలం 16 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆశారామ్​కు 67,980 ఓట్లు రాగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థి శంకర్​ ధ్రువకు 67,964 ఓట్లు పడ్డాయి.
    Chhattisgarh Election Results 2023
    బీజేపీ అభ్యర్థి ఆశారామ్​
  • ఉప ముఖ్యమంత్రి టీఎస్​ సింగ్ దేవ్​ అంబికాపుర్​ స్థానం నుంచి పోటీ చేసి 94 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సింగ్​ దేవ్​కు 90,686 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రాజేశ్ అగర్వాల్​కు 90,780 ఓట్లు వచ్చాయి.
    Chhattisgarh Election Results 2023
    ఉపముఖ్యమంత్రి టీఎస్​ సింగ్ దేవ్​
  • పత్యాలంగావ్​ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి గోమతి సాయి 255 ఓట్లతో గెలుపొందారు. ఆమెకు 82,320 ఓట్లు రాగా, సమీప కాంగ్రెస్​ అభ్యర్థి 82,065 ఓట్ల వచ్చాయి.
  • పాలీ తానాఖార్​ స్థానంలో తులేశ్వర్​ సింగ్​ మర్కామ్ 714 ఓట్లతో గెలుపొందారు. గోండ్వానా రిపబ్లిక్ పార్టీ అధ్యక్షుడైన ఈయన, ఆ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడం విశేషం. ఈయన ఆ పార్టీ వ్యవస్థాపకులు హిరా సింగ్​ మార్కామ్​ కుమారుడు. ఈయనకు 60,862 ఓట్లు రాగా, ప్రత్యర్థి కాంగ్రెస్​ అభ్యర్థి దులేశ్వరి సిదర్​కు 60,148 ఓట్ల పడ్డాయి.
  • బింద్రాన్వాగగఢ్​ కాంగ్రెస్​ అభ్యర్థి జనక్​ ధ్రువ్ 816 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి గోవర్థన్ సింగ్​ మాంఝీని ఓడించారు. ధ్రువ్​కు 92,639 ఓట్లు రాగా, ప్రత్యర్థికి 91,823 ఓట్లు వచ్చాయి.
  • భిలాయ్ నగర్​ కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్​ 1,264 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రేమ్​ ప్రకాశ్​ పాండేకు 53,141 రాగా, దేవేంద్రకు 54,405 ఓట్లు వచ్చాయి.

ఛత్తీస్​గఢ్​లో బీజేపీ అద్భుతం- పక్కా స్కెచ్​తో బఘేల్​ పాలనకు తెర

ఛత్తీస్‌గఢ్‌ బీజేపీదే- మేజిక్ ఫిగర్​ దాటేసిన కమలం పార్టీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.