ETV Bharat / bharat

వైభవంగా 'ఛఠ్​ పూజ' చివరి రోజు వేడుకలు

author img

By

Published : Nov 21, 2020, 9:37 AM IST

నాలుగురోజుల నుంచి అంగరంగ వైభవంగా సాగుతున్న 'ఛఠ్​ పూజ' ఉత్సవాలు శనివారంతో పూర్తయ్యాయి. ఉత్తరాదిలో పలుచోట్ల భక్తులు.. ఉదయించే సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ చివరిరోజు వేడుకల్లో పాల్గొన్నారు.

Chhath Puja concludes with prayers to the rising sun
ఘనంగా 'ఛఠ్​ పూజ'కు ముగింపు ఉత్సవాలు

ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో 'ఛఠ్ పూజ' వేడుకలు శనివారంతో పూర్తయ్యాయి. ఉదయించే సూర్యభగవానుడికి పూజలు చేసి ఈ ఉత్సవాలకు ముగింపు పలికారు. నదీతీర ప్రాంతాల్లో చివరిరోజు సంబరాలు ఉత్సాహంగా నిర్వహించారు భక్తులు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సూర్యుడికి ప్రత్యేక పూజలు చేశారు.

Chhath Puja concludes with prayers to the rising sun
వేడుకల్లో బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​
Chhath Puja concludes with prayers to the rising sun
వేడుకల్లో బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​
Chhath Puja concludes with prayers to the rising sun
పట్నాలో ఛఠ్​ పూజ చివరి రోజు ఉత్సవాల్లో భక్తులు

బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ ఈ ఉత్సవాల్లో పాల్గొని సూర్య భగవానుడికి పూజలు చేశారు. ఝార్ఖండ్​లోని రాంచీ, బిహార్​లోని పట్నాలో, ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలోని చాలా మంది భక్తులు నదీ ఘాట్ల వద్ద ఛఠ్​పూజ నాలుగో రోజు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కరోనా ప్రభావం వల్ల ఈసారి చాలా మంది ఇళ్ల వద్దే పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Chhath Puja concludes with prayers to the rising sun
నోయిడాలో పూజలు చేస్తున్న భక్తురాలు
Chhath Puja concludes with prayers to the rising sun
నోయిడాలో సూర్యుడికి అర్థ్యం సమర్పిస్తున్న ఓ భక్తుడు
Chhath Puja concludes with prayers to the rising sun
ప్రయాగ్​రాజ్​లో ఛఠ్​ పూజ ముగింపు వేడుకలు

లఖ్​నవూలోని గోమితి నదీ భక్తజనంతో నిండిపోయింది. కొవిడ్​ నిబంధనలను పాటిస్తూనే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు భక్తులు.

Chhath Puja concludes with prayers to the rising sun
ప్రయాగ్​రాజ్​లో పూజలో నిమగ్నమైన భక్తులు
Chhath Puja concludes with prayers to the rising sun
ముంబయిలో ఇంటి వద్దే సూర్యభగవానుడిని పూజిస్తున్న మహిళ
Chhath Puja concludes with prayers to the rising sun
వారణాసిలో సూర్య భగవానుడికి పూజలు
Chhath Puja concludes with prayers to the rising sun
వారణాసిలో ఉదయిస్తున్న సూర్యుడు

ముంబయి, దిల్లీ, భువనేశ్వర్​లలోనూ ఛఠ్ పూజ చివరి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Chhath Puja concludes with prayers to the rising sun
భువనేశ్వర్​లో తిలకం దిద్దుకుంటున్న మహిళలు
Chhath Puja concludes with prayers to the rising sun
భువనేశ్వర్​లో పూజోత్సవాలు
Chhath Puja concludes with prayers to the rising sun
ముంబయిలో వేడుకల్లో భక్త జన సందోహం

రాంచీలోని హతానియా తలాబ్​లో జరిగిన పూజా కార్యక్రమంలో మాజీ ఎంపీ సుబోధ్​ కాంత్​ సహాయ్ పాల్గొన్నారు. 'ప్రజల నమ్మకాలను ప్రభుత్వం అర్థం చేసుకోవడం సంతోషకరం. అనేక నిబంధనలు ఉన్నప్పటికీ ప్రజలు తమ సంప్రదాయం ప్రకారం పూజల్లో పాల్గొన్నారు. అందరూ భౌతిక దూరాన్ని పాటిస్తున్నార'ని అన్నారు.

Chhath Puja concludes with prayers to the rising sun
గోరఖ్​పుర్​లో ఉత్సవాలు

బిహార్​, ఝార్ఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రతి ఏటా వైభవంగా 'ఛఠ్​ పూజ' ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా కార్తీక మాసం శుక్ల పక్షంలోని షష్ఠి సందర్భంగా నాలుగు రోజుల పాటు ఈ ఛఠ్​ పూజలు చేస్తారు. చివరిరోజున తెల్లవారు జామున ఉదయించే సూర్యుడికి పూజలు చేయటంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

ఇదీ చూడండి:కన్నుల పండుగలా 'ఛఠ్​ పూజ' ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.