ETV Bharat / bharat

Chandrayaan 3 Landed on Moon : ల్యాండర్‌ విక్రమ్‌ నుంచి బయటకు వచ్చిన రోవర్ ప్రగ్యాన్‌

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 5:01 PM IST

Updated : Aug 23, 2023, 10:50 PM IST

Chandrayaan 3 Landing On Moon Today
Chandrayaan 3 Landing On Moon Today

22:22 August 23

చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన రోవర్‌ ప్రగ్యాన్‌

  • ల్యాండర్‌ విక్రమ్‌ నుంచి బయటకు వచ్చిన రోవర్ ప్రగ్యాన్‌
  • చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన రోవర్‌ ప్రగ్యాన్‌
  • 14 రోజులు చంద్రుడి ఉపరితలాన్ని పరిశోధించనున్న రోవర్‌ ప్రగ్యాన్‌
  • చంద్రుడిపై చదునుగా ఉన్న ఉపరితలంపై దిగిన విక్రమ్‌ ల్యాండర్‌
  • చంద్రుడిపై సురక్షితంగా దిగిన ఫొటోలను పంపిన ల్యాండర్ విక్రమ్‌
  • ఫొటోలో కనిపిస్తున్న ల్యాండర్‌ విక్రమ్ పాదం నీడ

20:52 August 23

ల్యాండింగ్​ తర్వాత జాబిల్లి ఫొటోలు తీసిన విక్రమ్ ల్యాండర్

  • చంద్రయాన్‌-3 ల్యాండింగ్‌ తర్వాత తొలిసారి తీసిన చిత్రాలు విడుదల
  • ల్యాండర్‌ విక్రమ్‌ తీసిన జాబిల్లి చిత్రాలు విడుదల చేసిన ఇస్రో
  • బెంగళూరు కేంద్రంతో అనుసంధానమైన చంద్రయాన్‌-3 ల్యాండర్‌

18:31 August 23

  • ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని అభినందించారు: సోమనాథ్‌
  • ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధానికి ధన్యవాదాలు: సోమనాథ్‌
  • దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు గర్వంగా ఉంది: సోమనాథ్‌
  • కొన్ని రోజులుగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: సోమనాథ్‌
  • ఇస్రోకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు: సోమనాథ్‌
  • ఈ విజయం ఒక్కరిది కాదు.. ఇస్రో నాయకత్వం, శాస్త్రవేత్తలది: సోమనాథ్‌
  • చంద్రయాన్‌-1 నుంచి ప్రస్తానం కొనసాగుతోంది: సోమనాథ్‌
  • చంద్రయాన్‌-2 ఇప్పటికీ పనిచేస్తోంది.. కమ్యూనికేట్‌ చేస్తోంది: సోమనాథ్‌

18:25 August 23

  • భారత అంతరిక్ష చరిత్రలో సువర్ణ ఘట్టం సాకారం
  • అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన భారత్‌
  • చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టిన ల్యాండర్‌
  • ప్రజ్ఞాన్‌ను విజయవంతంగా చంద్రుడిపై దింపిన ల్యాండర్‌ విక్రమ్‌
  • సుమారు 40 రోజులపాటు ప్రయాణించి చంద్రుడిపై దిగిన ల్యాండర్‌
  • విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి బయటకు రానున్న రోవర్‌ ప్రజ్ఞాన్‌
  • 14 రోజులు చంద్రుడి ఉపరితలాన్ని పరిశోధించనున్న ప్రజ్ఞాన్‌
  • చంద్రయాన్‌-3 విజయవంతమైనట్లు ప్రకటించిన ఇస్రో
  • జొహన్నెస్‌బర్గ్‌ నుంచి ప్రయోగం తిలకించిన ప్రధాని మోదీ
  • చంద్రయాన్‌-3 ఘన విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు

18:23 August 23

చంద్రయాన్‌ 3 సంపూర్ణ విజయంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు

  • చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన తొలిదేశంగా భారత్‌ రికార్డు
  • చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన నాలుగో దేశంగా భారత్‌ రికార్డ్‌
  • చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌తో అమెరికా, రష్యా, చైనా సరసన భారత్‌
  • ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు యత్నించి విఫలమైన రష్యా
  • చంద్రయాన్‌ 3 సంపూర్ణ విజయంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు

18:21 August 23

  • చంద్రయాన్‌-3 విజయవంతమైనట్లు ప్రకటించిన ఇస్రో
  • చంద్రయాన్‌-3 ఘన విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు

18:12 August 23

ISRO Chandrayaan 3 PM Modi Speech : ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ అభినందన

  • చంద్రుడిని చేరుకున్నట్టు ట్వీట్ చేసిన చంద్రయాన్ 3 మిషన్
  • నా గమ్యాన్ని చేరుకున్నాను నాతో పాటు మీరు కూడా అంటూ చంద్రయాన్ 3 ట్వీట్
  • చంద్రయాన్ 3 మిషన్ ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయినట్టు పేర్కొన్న ఇస్రో

18:09 August 23

ISRO Chandrayaan 3 PM Modi Speech : ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ అభినందన

  • చంద్రయాన్‌-3 ఘనవిజయంతో నా జీవితం ధన్యమైంది: ప్రధాని
  • ఈ విజయం దేశం గర్వించే మహత్తర క్షణాలు: ప్రధాని
  • చంద్రయాన్‌-3 విజయం నవభారత జయధ్వానం: ప్రధాని
  • భారత్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది: ప్రధాని మోదీ
  • అమృత కాలంలో తొలి ఘన విజయం ఇది: ప్రధాని మోదీ
  • జాబిల్లి దక్షిణ ధ్రువంపై భారత్‌ అడుగుపెట్టింది: ప్రధాని మోదీ
  • బ్రిక్స్‌ సమావేశాల్లో ఉన్నా నా మనసంతా చంద్రయాన్‌-3 పైనే ఉంది: ప్రధాని
  • ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
  • చంద్రయాన్‌-3 బృందం, ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు: ప్రధాని
  • ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా: ప్రధాని మోదీ
  • అద్భుత విజయం కోసం 140 కోట్ల ప్రజలు ఎదురుచూశారు: ప్రధాని
  • త్వరలోనే ఆదిత్యుడిపై ప్రయోగం: ప్రధాని మోదీ

18:04 August 23

  • అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన భారత్‌
  • చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టిన రోవర్ ప్రజ్ఞాన్‌
  • ప్రజ్ఞాన్‌ను విజయవంతంగా చంద్రుడిపై దింపిన ల్యాండర్‌ విక్రమ్‌
  • సుమారు 40 రోజులపాటు ప్రయాణించి చంద్రుడిపై దిగిన ల్యాండర్‌
  • ల్యాండర్‌ విక్రమ్‌ నుంచి వేరుపడి చంద్రుడిపై అడుగుపెట్టిన రోవర్‌ ప్రజ్ఞాన్‌
  • 14 రోజులపాటు చంద్రుడి ఉపరితలాన్ని పరిశోధించనున్న ప్రజ్ఞాన్‌
  • 14 రోజుల తర్వాత పరిస్థితి అనుకూలిస్తే మరో 14 రోజులు పనిచేయనున్న ప్రజ్ఞాన్‌

17:48 August 23

  • చంద్రుడిపై ల్యాండర్‌ విక్రమ్‌ దిగే ప్రక్రియ ప్రారంభం
  • చంద్రుడిపై ల్యాండర్‌ విక్రమ్‌ సాఫ్ట్‌ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రారంభం
  • చంద్రుడిపై 17 నిమిషాలపాటు సాఫ్ట్‌ల్యాండింగ్‌ ప్రక్రియ
  • జాబిల్లి దక్షిణ ధ్రువానికి మరింత చేరువవుతున్న విక్రమ్‌
  • బెంగళూరు కేంద్రంలో నిశితంగా పరిశీలిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలు

17:24 August 23

  • కాసేపట్లో చంద్రుడిపై దిగనున్న ల్యాండర్‌ విక్రమ్‌
  • సాయంత్రం. 6.04గం.కు చంద్రునిపై దిగనున్న ల్యాండర్‌ విక్రమ్‌
  • జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు యత్నిస్తున్న చంద్రయాన్‌ 3
  • చివరి 17 నిమిషాలు అత్యంత కీలకమంటున్న ఇస్రో శాస్త్రవేత్తలు
  • శాస్త్రవేత్తల నియంత్రణ లేకుండా స్వతంత్రంగా సాగనున్న సాఫ్ట్‌ల్యాండింగ్‌
  • చంద్రయాన్‌ 2 వైఫల్యం దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇస్రో
  • వైఫల్య ఆధారిత డిజైన్‌ ద్వారా అదనపు సెన్సర్లు అమర్చిన ఇస్రో
  • కీలక వ్యవస్థల విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ఇస్రో
  • ఈసారి సాఫ్ట్ ల్యాండింగ్‌ సాధించడం ఖాయమంటున్న ఇస్రో శాస్త్రవేత్తలు
  • అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డుకు ప్రయత్నిస్తున్న ఇస్రో
  • సాఫ్ట్‌ ల్యాండింగ్‌ విజయవంతమైతే భారత్‌ ఖాతాలో కొత్త రికార్డ్‌ చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా నిలవనున్న భారత్‌
  • ఇటీవల చంద్రుడి దక్షిణధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌లో రష్యా విఫలం
  • చంద్రయాన్‌-3 సాఫ్ట్‌ ల్యాండింగ్‌పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
  • సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారం చేయనున్న ఇస్రో
  • దేశవ్యాప్తంగా అనేక పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసార వీక్షణకు ఏర్పాట్లు
  • చంద్రయాన్‌-3 విజయవంతం కావాలని దేశవ్యాప్తంగా పూజలు
  • చంద్రయాన్‌ 3 ఫలితం కోసం ఆసక్తిగా చూస్తున్న ప్రపంచ దేశాలు

17:20 August 23

Chandrayaan 3 Landing On Moon Today : జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండింగ్.. మినిట్ టు మినిట్ అప్డేట్స్

జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండింగ్​ను లైవ్​లో వీక్షించేందుకు ఈ లింక్​పై క్లిక్ చెయ్యండి.

16:37 August 23

Chandrayaan 3 Landing On Moon Today : జాబిల్లిపై చంద్రయాన్-3 ల్యాండింగ్.. మినిట్ టు మినిట్ అప్డేట్స్

Chandrayaan 3 Landing On Moon Today : జాబిల్లిపై విక్రమ్‌ ల్యాండర్‌ అడుగుపెట్టే చరిత్రాత్మక క్షణాల కోసం యావత్‌ భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇప్పటివరకూ అన్ని దశలనూ సవ్యంగా పూర్తిచేసుకున్న చంద్రయాన్‌-3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్‌కు ఉపక్రమించనుంది. సాయంత్రం 5 గంటల 44 నిమిషాలకు ల్యాండర్‌ మాడ్యూల్‌ నిర్దేశిత ప్రాంతానికి చేరుకోనుంది. అక్కడికి రాగానే ఆటోమేటిక్‌ ల్యాండింగ్‌ సీక్వెన్స్‌ ప్రారంభమవుతుంది. ఏఎల్‌ఎస్‌ కమాండ్‌ను స్వీకరించిన వెంటనే ల్యాండర్‌ మాడ్యూల్‌ థ్రాటల్‌బుల్‌ ఇంజిన్ల వేగాన్ని తగ్గించుకుంటూ ముందుకెళ్తుంది. ల్యాండింగ్‌ ప్రక్రియను సాయంత్రం 5.20 గంటల నుంచే ఇస్రో తమ వెబ్‌సైట్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

ISRO Chandrayaan 3 Soft Landing : 17 నిమిషాలపాటు సాగే ల్యాండింగ్‌ ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే దీన్ని 17 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. గంటకు దాదాపు 6 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వ్యోమనౌక జోరుకు 17 నిమిషాల్లోనే కళ్లెం వేసి, చందమామ దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దించాలి. దీన్ని సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అంటారు. అనంతరం ల్యాండర్‌ నుంచి ఆరు చక్రాల ప్రగ్యాన్‌ రోవర్‌ నెమ్మదిగా దిగివస్తుంది. చందమామ ఉపరితలంపై సెకనుకు సెంటీమీటరు వేగంతో కదులుతుంది. ల్యాండర్‌, రోవర్‌ 14 రోజుల పాటు జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు నిర్వహిస్తాయి.

Chandrayaan 3 Failure Based Design : చంద్రయాన్‌-2 వైఫల్యం నుంచి నేర్చుకున్న గుణపాఠాల ఆధారంగా చంద్రయాన్‌-3 విషయంలో ఇస్రో చాలా జాగ్రత్తలు తీసుకుంది. అడ్డంకులు ఎదురైనా తట్టుకునేలా వైఫల్య ఆధారిత డిజైన్‌ ద్వారా వ్యోమనౌకను రూపొందించింది. అదనపు సెన్సర్లు అమర్చింది. ఒకటి విఫలమైనా.. మరొకటి ఆ బాధ్యతను అందిపుచ్చుకునేలా కీలకమైన వ్యవస్థల విషయంలో ప్రత్యామ్నాయాలు ఏర్పాటుచేసింది. అందుకే ఈసారి సాఫ్ట్‌ ల్యాండింగ్‌ను సాధించడం ఖాయమని ధీమాగా ఉంది.

ఇప్పటివరకు అమెరికా, సోవియట్‌ యూనియన్‌, చైనా మాత్రమే చంద్రునిపై సురక్షితంగా వ్యోమనౌకలను దించాయి. ఇస్రో ఈ ఘనత సాధిస్తే ఆయా దేశాల సరసన చేరనుంది. అంతేకాదు ఇప్పటివరకు ఏ దేశం కూడా జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలుమోపలేదు. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-3 సాఫ్ట్‌ల్యాండింగ్‌ విజయవంతమైతే చంద్రునిపై ఇస్రో సరికొత్త చరిత్ర లిఖించనుంది. ఇటీవల జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌కు యత్నించి రష్యా విఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల దృష్టి చంద్రయాన్‌-3 ప్రయోగంపైనే ఉంది.

Last Updated : Aug 23, 2023, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.