ETV Bharat / bharat

ఏపీలో సహా ఆ రాష్ట్రాల్లో చాపకింద నీరులా కరోనా.. కేంద్రం సీరియస్

author img

By

Published : Nov 3, 2021, 10:21 PM IST

Updated : Nov 4, 2021, 6:58 AM IST

covid
కొవిడ్

ఆంధ్రప్రదేశ్​తో పాటు పలు రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటుతో పాటు.. కొత్త కేసులు అసాధారణంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలుచేయాలని సూచించింది. ఈ మేరకు కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, జమ్ముకశ్మీర్ ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది.

ఆంధ్రప్రదేశ్​తో పాటు పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు క్రమంగా పెరగడాన్ని కేంద్రం సీరియస్​గా తీసుకుంది. పాజిటివిటీ రేటును సమీక్షించాలని.. నిర్ధరణ పరీక్షలను పెంచాలని చురకలు సూచించింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య కార్యదర్శి, జమ్ముకశ్మీర్ అదనపు ఆరోగ్య ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహుజా లేఖలు రాశారు. గతవారం కొత్త కేసులు భారీగా పెరిగిన విషయాన్ని ఆ లేఖలో ప్రస్తావించింది కేంద్రం. నెల రోజులుగా పాజిటివిటీ రేటు కూడా పెరిగినట్లు ఈ సందర్భంగా గుర్తుచేసింది. పండగల సమయంలో కఠినంగా నిబంధనలను అమలు చేయాలని సూచించింది.

కేంద్రం లేఖలోని ప్రధాన అంశాలు..

  • హిమాచల్ ప్రదేశ్‌లో గత వారం రోజుల్లో కొత్త కేసులు దాదాపు 22 శాతం పెరిగాయి.
  • జమ్ముకశ్మీర్​లో వారానికొకసారి కొత్త కేసుల్లో సుమారు 61 శాతం పెరుగుదల కనిపించింది. పాజిటివిటీ రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ.. రెండు వారాల్లో కొత్త కేసులు 67 శాతం పెరిగాయి.
  • ఆంధ్రప్రదేశ్​లో గత నాలుగు వారాల్లో కొత్త కేసుల సంఖ్య రెట్టింపు అయింది. అయితే పాజిటివిటీ రేటు 2.5 శాతం కంటే తక్కువగా నమోదైంది. అత్యధిక కేసులు వెలుగుచూసిన తూర్పుగోదావరిని ఆందోళనకరమైన జిల్లాగా గుర్తించింది కేంద్రం.

కఠిన ఆంక్షలు తప్పనిసరి..

టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్‌మెంట్, సహా.. కొవిడ్ నిబంధనలను పాటించకపోవడం వల్లే కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు కేంద్రం చురకలు అంటించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఐసీయూ, ఆక్సిజన్, వెంటిలేటర్ పడకల సామర్థ్యాన్ని పెంచుకోవాలని స్పష్టం చేసింది.

చివరిగా.. వ్యాక్సిన్ మొదటి డోసు పంపిణీని 100 శాతం అమలు చేసేలా రాష్ట్రాలు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని కేంద్రం ఉద్ఘాటించింది. అలాగే రెండో డోసు పంపిణీని ఆలస్యం చేయొద్దని తెలిపింది.

ఇవీ చదవండి:

Last Updated :Nov 4, 2021, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.