ETV Bharat / bharat

సీబీఐ అధికారులపై గ్రామస్థుల దాడి.. ఏమైందంటే..?

author img

By

Published : Nov 17, 2021, 5:35 AM IST

అంతర్జాలంలో చైల్డ్​ పోర్న్​కు సంబంధించి ఓ నిందితుడి ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారులపై గ్రామస్థులు దాడికి దిగారు. ఈ ఘటన ఒడిశాలోని దేనకనాల్ జిల్లాలో జరిగింది.

Od
సీబీఐ అధికారులపై గ్రామస్థుల దాడి

సీబీఐ అధికారులపై గ్రామస్థుల దాడి

ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే ముఠాలే లక్ష్యంగా సీబీఐ దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో ఒడిశాలోని దేనకనాల్ జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం సీబీఐ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. నిందితుడి ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన సీబీఐ బృందంపై అతడి కుటుంబసభ్యులు, గ్రామస్థులు దాడికి దిగారు. కర్రలతో అధికారులపై దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సీబీఐ అధికారులను గ్రామం నుంచి పంపించారు.

ఏకకాలంలో 14 రాష్ట్రాల్లో..

దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 76 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపినట్లు అధికారులు తెలిపారు. చిన్నారుల్ని లైంగికంగా వేధించిన ఆరోపణలపై సీబీఐ ఈనెల 14న 83 మంది నిందితులపై 23 కేసులు నమోదు చేసింది. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్​ సహా.. దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్‌, బిహార్‌, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్‌, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. సుమారు 80 బృందాలు అనుమానిత ప్రాంతాల్లో దాడులు జరిపినట్లు వెల్లడించింది.

2019లో, సీబీఐ తన ప్రత్యేక క్రైమ్ జోన్ కింద న్యూదిల్లీలో ఆన్‌లైన్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అండ్ ఎక్స్‌ప్లోయిటేషన్ నిరోధక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌లో పిల్లలపై లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించిన సమాచారాన్ని ఓ ప్రత్యేక బృందం సేకరిస్తుంది. అనంతరం నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటుంది. ఇప్పటివరకు వివిధ కేసుల్లో పలువురు నిందితులను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.

ఇదీ చూడండి: నదిలో పడవ మునక- ఇద్దరు మృతి, పదుల సంఖ్యలో గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.