ETV Bharat / bharat

చిదంబరంపై సీబీఐ మరో కేసు.. తొమ్మిది చోట్ల సోదాలు

author img

By

Published : May 17, 2022, 9:50 AM IST

Updated : May 17, 2022, 1:14 PM IST

Karti Chidambaram CBI: కాంగ్రెస్​ నేత చిదంబరం కుమారుడిపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఈ కేసులో భాగంగా.. దేశంలోని తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. సుమారు రూ. 50 లక్షలు తీసుకుని.. చైనాకు చెందిన పలువురికి వీసా ఇప్పించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కార్తీ చిదంబంరం.

చిదంబరం
చిదంబరం

Karti Chidambaram CBI: మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరో కేసు నమోదు చేసింది. 2010-14 మధ్య కాలంలో లావాదేవీలు, విదేశీ డబ్బు పంపిన ఆరోపణలకు సంబంధించి కార్తీపై కొత్త కేసు నమోదు చేసిన సీబీఐ ముంబయి, దిల్లీ తమిళనాడు సహా పలు ప్రాంతాలు కలిపి మొత్తం 9 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. చెన్నై, దిల్లీలోని చిదంబరం ఇంటిపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ దాడులు చేసింది. చిదంబరం ఇంటి వద్ద ఉదయం 8 గంటల నుంచే సోదాలు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

సీబీఐ వర్గాల సమాచారం ప్రకారం.. కొత్తగా నమోదు చేసిన కేసులో ఆరోపణలు అన్నీ ప్రధానంగా కార్తీ చిదంబరంపైనే ఉన్నాయి. సుమారు రూ. 50 లక్షలు తీసుకుని.. చైనాకు చెందిన 250 మందికి వీసా ఇప్పించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కార్తీ. చెన్నైలో 3, కర్ణాటకలో 1, ముంబయిలో 3, పంజాబ్​లో 1, ఒడిశాలో 1 ప్రదేశాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలపై స్పందించిన కార్తీ చిదంబరం.. "నేను లెక్క మర్చిపోయాను. ఇప్పటివరకు ఇలా ఎన్ని సోదాలు నిర్వహించారు? దానిపై ఏదో ఒక రికార్డు ఉండే ఉంటుంది" అని వ్యంగ్యంగా ట్వీట్​ చేశారు. కార్తీ చిదంబరంపై ఇప్పటికే ఐఎన్​ఎక్స్​ మీడియాకు ఫారెన్ ఇన్వెస్ట్​మెంట్​ ప్రమోషన్​ బోర్డ్​ క్లియరెన్స్​ ఇప్పించిన కేసులో విచారణ కొనసాగుతోంది.

మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం.. 'ఈ ఉదయం చెన్నై, దిల్లీలోని నా అధికారిక నివాసాల్లో సీబీఐ బృందం సోదాలు చేసింది. నేను నిందితుడిగా లేని ఒక ఎఫ్‌ఐఆర్‌ను చూపించింది. సీబీఐ బృందం తన సోదాల్లో నా నివాసాల్లో ఏమీ కనుగొనలేదు, స్వాధీనం చేసుకోలేదు, సీజ్ చేయలేదు. సీబీఐ సోదాలు జరిపిన సమయం ఆసక్తికరంగా ఉంది' అని ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి : జైలులో అసహజ శృంగారం.. 20 ఏళ్ల యువకుడిపై టీనేజర్​..

Last Updated :May 17, 2022, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.