ETV Bharat / bharat

Manipur Students Death : మణిపుర్‌ విద్యార్థుల హత్య కేసులో నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ.. వెంటనే అసోంకు తరలింపు

author img

By PTI

Published : Oct 1, 2023, 10:36 PM IST

Updated : Oct 2, 2023, 6:36 AM IST

Manipur Students Death : మణిపుర్‌లో ఇటీవలే జరిగిన ఇద్దరు విద్యార్థుల హత్య ఘటనతో సంబంధమున్న నలుగురు నిందితులను సీబీఐ తాజాగా అరెస్టు చేసింది. ఇద్దరు బాలికలు సహా నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Manipur Students Death :
Manipur Students Death :

Manipur Students Death : మణిపుర్‌లో ఇద్దరు విద్యార్థులను దారుణంగా హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. ఇంఫాల్‌కు 51 కిలోమీటర్ల దూరంలోని చురాచంద్‌పుర్‌ జిల్లాలో ఇద్దరు బాలికలు సహా నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా అరెస్టైన నలుగురిని వెంటనే అసోంలోని గువాహటికి తరలించామని తెలిపారు. నిందితుల్లో ఒకరిని వారి పిల్లలతో సహా అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆ పిల్లలను వారి బంధువులకు అప్పగించే అవకాశం ఉందన్నారు. మణిపుర్‌ పోలీసులు, ఆర్మీ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేసినట్లు వెల్లడించారు. ఈ జాయింట్​ ఆపరేషన్‌కు రిటైర్డ్ కల్నల్ నెక్టార్ సంజెబామ్ నేతృత్వం వహించారు. గతంలో ఆయన '21 పారా'లో పని చేశారు. ఇటీవలే ఆయన సీనియర్‌ ఎస్పీ(కొంబాట్)గా నియమితులయ్యారు. జులైలో కనిపించకుండా పోయిన మైనర్​ విద్యార్థుల(ఓ యువతి, ఓ యువకుడు) మృతదేహాల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అయితే అరెస్టు సమాచారం తెలిసి కొన్ని అల్లరి మూకలు ఎయిర్‌పోర్టు దిశగా దూసుకెళ్లినట్లు సమాచారం.

  • "I’m pleased to share that some of the main culprits responsible for the abduction and murder of Phijam Hemanjit and Hijam Linthoingambi have been arrested from Churachandpur today." tweets Manipur CM N Biren Singh pic.twitter.com/cHuLJWS9xz

    — ANI (@ANI) October 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నేరం చేసినవారు తప్పించుకోలేరు : సీఎం
Manipur Violence : మరోవైపు నిందితులను అరెస్టు చేసినట్లు మణిపుర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. నేరం చేసినవారెవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని.. క్రూరమైన నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Manipur Minor Students Murder Case : జాతుల మధ్య వైరంతో అట్టుడికిపోతున్న మణిపుర్‌లో ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైన విషయం సెప్టెంబర్‌ 26న సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన కొందరు విద్యార్థులు ఏకంగా ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్​ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది వారిని చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌, స్మోక్‌ బాంబ్స్‌ను వినియోగించారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. యువతిని అత్యాచారం చేసి హత్య చేశారా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.

Uterus In Man Body : యువకుడి కడుపులో గర్భాశయం.. పొట్ట నొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్తే షాక్

Boy Saved by Fishermen After 36 Hours : బాలుడిని కాపాడిన వినాయకుడి విగ్రహం చెక్క.. సముద్రంలో గల్లంతైన 36 గంటల తర్వాత క్షేమంగా..

Last Updated :Oct 2, 2023, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.