ETV Bharat / bharat

ప్రభుత్వ ఆఫీసులో పిల్లి.. రోజంతా ఫైళ్ల మధ్యే టైమ్​పాస్.. ఉద్యోగుల్లో కలిసిపోయి..

author img

By

Published : Mar 22, 2023, 12:50 PM IST

cat-in-rto-office-uttarpradesh
ఆర్టీఓ ఆఫీస్​లో పిల్లి.. ఉద్యోగులతో చెలిమి

ఆర్టీఓ ఆఫీసులో.. ఓ పిల్లి ఉద్యోగుల మధ్య దర్జాగా తిరుగుతోంది. ఆఫీస్​లో స్వేచ్ఛగా తిరుగుతూ వాళ్లు పెట్టింది తింటూ.. అక్కడే ఉంటోంది. ఉద్యోగులు కూడా పిల్లిని ప్రేమగా చూసుకుంటున్నారు.

ఓ పిల్లి ఆర్టీఓ ఆఫీస్​లో దర్జాగా తిరుగుతోంది. ఉద్యోగుల మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటోంది. వారితో పాటే ఆఫీసులో ఉంటూ, వారు పెట్టింది తింటూ ఉల్లాసంగా గడుపుతోంది. ఆఫీస్​లోని బల్లలపై, ఫైళ్లపై కూర్చుని హాయిగా సేద తీరుతోంది. కొన్ని సార్లు ఉద్యోగుల ఒడిలో సైతం కూర్చుంటోంది. ఉత్తర్​ప్రదేశ్​.. ఝాన్సీ జిల్లాలోని ఆర్టీఓ ఆఫీస్​లో ఉందీ పిల్లి.

ఆఫీస్​లోని పెద్ద, చిన్న స్థాయి అధికారులందరూ ఈ పిల్లిని ప్రేమగా చూసుకుంటారని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. దీనికి ముద్దుగా పింకి అని పేరు సైతం పెట్టుకున్నట్లు వెల్లడించారు. రోజూ పిల్లికి పాలు, బిస్కెట్లు ఆహారంగా ఇస్తామని చెప్పారు. పిల్లి కూడా తమలో ఒకరిగా కలిసిపోయిందని చెబుతున్నారు.

Cat in RTO office uttarpradesh
అధికారి ఒడిలో కూర్చున పిల్లి
Cat in RTO office uttarpradesh
ఆర్టీఓ ఆఫీస్​లో పిల్లి

"ఒక రోజు ఆఫీస్​ బయట ఈ పిల్లి తిరుగుతూ కనిపించింది. దాన్ని తీసుకువచ్చి ఆఫీసులో వదిలాం. రోజూ మాలో ఒకరం దానికి ఏదైన తినేందుకు తీసుకువస్తాం. ఓ మహిళ ఉద్యోగి మధ్యాహ్నం పింకికి ఇంటి నుంచి ఆహారాన్ని తీసుకుని వస్తుంది. ఆమె పింకి పట్ల ఎనలేని ప్రేమను చూపిస్తుంది. పింకి రోజంతా ఆఫీసులోనే ఉంటుంది. అన్ని గదుల్లో తిరుగుతుంది" అని జీతు అనే ఉద్యోగి తెలిపారు.

ప్రస్తుతం ఈ పిల్లి ఆఫీస్​లో సెంటర్ ఆఫ్​ అట్రాక్షన్​గా మారింది. వివిధ పనుల కోసం ఆర్టీఓ ఆఫీస్​కు వచ్చే వాళ్లంత.. స్వేచ్ఛగా ఉద్యోగుల మధ్య తిరిగే పిల్లిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిల్లి ఆఫీస్​లో ఎక్కడ కూడా మూత్ర విసర్జన చేయదని ఉద్యోగులు చెబుతున్నారు. దీని వల్ల ఎలుకల బెడద కూడా తప్పిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పింకిని ప్రేమగా చూసుకుంటూ ఆఫీసులోనే పెట్టుకున్నట్లు వెల్లడిస్తున్నారు.

Cat in RTO office uttarpradesh
టేబుల్​పై పడుకున్న పిల్లి

రిచ్ క్యాట్ ఇదే..
సాధారణంగా మనుషులకు పెంపుడు జంతువులు అనగానే.. శునకాల తర్వాత పిల్లులే గుర్తొస్తాయి. చాలా మంది తమ ఇళ్లలో పిల్లులను పెంచుకుంటుంటారు. ఇటీవల ప్రముఖ సింగర్.. పిల్లి పేరిట రూ.800 కోట్ల ఆస్తి రాసింది. దీంతో ఈ పిల్లి ప్రపంచంలోనే మూడో రిచ్​ పెట్​గా రికార్డ్​లోకి ఎక్కింది. మరి ఆ సింగర్ ఎవరు? ఒక్కసారిగా ధనవంతురాలిగా మారిన ఆ పిల్లి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

మరోవైపు, కర్ణాటకకు చెందిన వ్యక్తి ఓ వ్యక్తి.. గ్రామంలోని 5,000 మందిని పిలిచి, 100 కిలోల కేక్​ను కట్​ చేసి కుక్క పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేశాడు. 300 కేజీల మాంసం, 100 కేజీల గుడ్లతో అతిథులకు వంటకాలు చేసి పెట్టాడు. శాకాహారులకు 50 కేజీల కూరగాయల భోజనాన్ని ఏర్పాటు చేశాడు. కానీ దీని వెనక కారణం వేరే ఉందట. అదేంటో తెలియాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.