'హెల్మెట్​ పెట్టుకోలేదు.. రూ.500 ఫైన్​ కట్టు'.. కారు ఓనర్​కు పోలీసుల నోటీస్

author img

By

Published : Dec 31, 2022, 5:04 PM IST

Car owner fined Rs 500 for not wearing helmet by karnataka traffic police
కర్ణాటకలో హెల్మెట్​ పెట్టుకోలేదని కారుకు ఫైన్ ()

హెల్మెట్​ పెట్టుకోలేదని కారు ఓనర్​కు రూ.500 ఫైన్​ విధించారు ట్రాఫిక్​ పోలీసులు. దీంతో కారు యజమాని అవాక్కయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. అనంతరం పోలీసులను సంప్రదించగా వారు జరిగింది చెప్పారు. చివరకు ఏమైందంటే?

పోలీసులు చేసిన పనికి ఓ కారు ఓనర్​ ఆశ్చర్యానికి గురయ్యాడు. వారిచ్చిన నోటీసు చూసి కంగుతిన్నాడు. కారులో పక్కన కూర్చున్న వ్యక్తి హెల్మెట్​ పెట్టుకోలేదని.. పోలీసులు విధించిన రూ.500 ఫైన్ నోటీసుతో అవాక్కయ్యాడు. నోటీసును తనిఖీ చేయగా పొరపాటున తనకు జరిమానా విధించారని తెలిసింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

Car owner fined Rs 500 for not wearing helmet by karnataka traffic police
కర్ణాటకలో హెల్మెట్​ పెట్టుకోలేదని కారుకు ఫైన్

వివరాల్లోకి వెళితే..
మంగళూరు ట్రాఫిక్​ పోలీసులు ఓ కారు ఓనర్​కు రూ.500 ఫైన్​ విధించారు. డిసెంబర్ 29న ఈ నోటీస్​ను జారీ చేశారు పోలీసులు. డిసెంబర్​ 22న మంగళాదేవి ప్రాంతంలో.. వెళుతున్న సయమంలో కారు యజమాని ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లఘించారని ఈ చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఇదే విషయంపై ట్రాఫిక్​ పోలీసులను సంప్రదించాడు ఆ కారు ఓనర్​. వాస్తవాన్ని తెలుసుకున్న పోలీసులు.. నోటీసు పంపడంలో పొరపాటు జరిగిందని సదరు కారు యజమానికి తెలిపారు.

"కారు వెళుతున్న సమయంలో దాని వెనకాలే ఓ బైక్ ఉంది. ఆ బైకర్​..​ వెనకాల కూర్చున్న వ్యక్తి హెల్మెట్​ ధరిచంలేదు. పొరపాటున వారికి విధించే ఫైన్​..​ కారు ఓనర్​కు విధించాం. ఆటోమేషన్ విధానంలో పొరపాటు వల్ల ఇలా జరిగింది" అని పోలీసులు తెలిపారు. అనంతరం సమస్యను పరిష్కరించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.