ETV Bharat / bharat

గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​కు ఐఏఎఫ్​ నివాళి

author img

By

Published : Dec 16, 2021, 11:57 AM IST

Captain Varun Singh: కెప్టెన్​ వరుణ్​ సింగ్​ భౌతికకాయానికి.. బెంగళూరులోని యెలహంక ఎయిర్​ ఫోర్స్​ బేస్​లో ఐఏఎఫ్​ అధికారులు నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.

captain varun singh
వరుణ్​ సింగ్​

captain varun singh: తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ భౌతకకాయానికి.. కర్ణాటక బెంగళూరులోని యెలహంక ఎయిర్​ ఫోర్స్​ బేస్​లో ఐఏఎఫ్​ నివాళులర్పించింది.

captain-varun-singh
నివాళులర్పిస్తున్న వాయుసేన ఉన్నతాధికారులు
captain-varun-singh
యెలహంక ఎయిర్​ బేస్​లో వరుణ్​ సింగ్​ భౌతికకాయం

భారత వాయుసేనలోని ఉన్నతాధికారులు, సైనికులు వరుణ్​ సింగ్​ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

captain-varun-singh
వరుణ్​ సింగ్​ భౌతిక కాయానికి నివాళులు

అనంతరం.. వరుణ్​ సింగ్​ భౌతికకాయాన్ని యెలహంక ఎయిర్​ బేస్​ నుంచి వాయుమార్గంలో మధ్యప్రదేశ్​లోని భోపాల్​కు తరలించారు.

మృత్యువుతో పోరాడి..

డిసెంబర్​ 8న తమిళనాడు కూనూర్​ సమీపంలో వాయుసేనకు చెందిన చాపర్​​ కూలిపోయింది. ఈ ఘటనలో 13 మంది చనిపోయినట్లు వాయుసేన అదేరోజు ప్రకటించింది. మృతుల్లో భారత త్రివిధ దళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది సిబ్బంది మరణించారు. తీవ్రంగా గాయపడ్డ గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​కు తొలుత వెల్లింగ్టన్​ మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కొద్దిరోజులకు బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. 8 రోజులు మృత్యువుతో పోరాడిన అనంతరం బుధవారం కన్నుమూశారు.

ఇదీ చూడండి:

Varun Singh: మృత్యువుతో పోరాడి ఓడిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.