ETV Bharat / bharat

నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 13 మంది మృతి.. పలువురు గల్లంతు

author img

By

Published : Jul 18, 2022, 11:28 AM IST

Updated : Jul 18, 2022, 1:49 PM IST

bus accident today
నదిలోకి దూసుకెళ్లిన బస్సు

11:25 July 18

నదిలోకి దూసుకెళ్లిన బస్సు

నదిలోకి దూసుకెళ్లిన బస్సు

Bus Accident: మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు నదిలోకి దూసుకెళ్లగా.. 13 మంది మరణించారు. మరో 15 మందిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ధార్ జిల్లా ఖాల్​ఘాట్​ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఇందోర్​ నుంచి మహారాష్ట్రలోని పుణె వెళ్తున్న బస్సు.. వంతెనపై అదుపు తప్పి నర్మదా నదిలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. మిగతావారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఖాల్‌ఘాట్‌ వద్ద ఉన్న సంజయ్‌ వంతెనపైకి రాగానే బస్సు అదుపు తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో వంతెన గోడను ఢీకొని సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి బస్సు నదిలోకి పడిపోయినట్లు వివరించారు. ఉదయం 10 గంటలకు ప్రమాదం జరగినట్లు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం పలువురు ప్రయాణికులు నీటిలో గల్లంతు కాగా, మరికొందరు బస్సులోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​, హోం మంత్రి నరోత్తమ్​ మిశ్రా విచారం వ్యక్తం చేశారు.
ఘటనకు సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో మాట్లాడినట్లు చెప్పారు చౌహాన్​. గాలింపు కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించానని సీఎం వెల్లడించారు.

ప్రమాదానికి గురైన బస్సు 10 ఏళ్లుగా సర్వీసులో ఉందని, ఫిట్​నెస్​ సర్టిఫికెట్​ కూడా 10 రోజుల్లో ముగుస్తుందని మహారాష్ట్ర ఆర్టీఓ అధికారులు వెల్లడించారు. నాగ్​పుర్​ రూరల్​ రీజనల్​ ట్రాన్స్​పోర్ట్​ ఆఫీస్​లో.. 2012, జూన్​ 12న బస్సు రిజిస్ట్రేషన్​ జరిగింది. వాహనం సక్రమంగా ప్రయాణించడానికి అనువుగా ఉందని సూచించే సర్టిఫికెట్​ గడువు ఈ జులై 27న ముగియనుందని ఆర్టీఓ పేర్కొంది. పొల్యూషన్​ అండర్​ కంట్రోల్​(పీయూసీ) సర్టిఫికెట్​, ఇన్సూరెన్స్​ చెల్లుబాటు అవుతాయని తెలిపింది. ప్రమాదానికి గురైన బస్సును చంద్రకాంత్​ ఏక్​నాథ్​ పాటిల్​ అనే డ్రైవర్​ నడిపాడని, ప్రకాశ్​ శ్రావణ్​ చౌధరీ కండక్టర్​గా ఉన్నారని మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వెల్లడించింది.

Last Updated : Jul 18, 2022, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.