ETV Bharat / bharat

పెళ్లి రోజే గుండెపోటుతో వధువు మృతి.. అయినా ఆగని వివాహం

author img

By

Published : Feb 24, 2023, 1:16 PM IST

కొన్నిసార్లు మనం ఒకటి తలిస్తే విధి మరొకటి తలుస్తుంది. అలానే కొన్ని గంటల్లో పెళ్లి కావాల్సిన వధువు ఒక్కసారిగా గుండెపోటుతో మృతి చెందింది. అయినా.. వివాహం ఆగలేదు. కుమార్తె చనిపోయిన బాధలో ఉన్న వధువు కుటుంబం.. వరుడికి మరో కూతురునిచ్చి విహహం చేసింది. ఈ ఘటన గుజరాత్​లో జరిగింది.

Etv Bharat
Etv Bharat

గుజరాత్​లో పెళ్లి సందడితో మునిగితేలిన ఓ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా.. వధువు గుండెపోటుతో మృతి చెందింది. అయితే వధువు కుటుంబ సభ్యులు మాత్రం పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి ఊరేగింపుతో ఇంటికి వచ్చిన వరుడు, అతని కుటుంబసభ్యుల్ని నిరాశపరచకుండా.. మృతి చెందిన కుమార్తె స్థానంలో ఆమె చెల్లినిచ్చి వివాహం జరిపించారు.

అసలేం జరిగిందంటే..?
భావ్​నగర్​ జిల్లాలోని సుభాశ్​ నగర్​ ప్రాంతానికి చెందిన జినాభాయ్​ భాకాభాయ్​ రాఠోడ్​కు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. నారీ గ్రామానికి చెందిన రాణాభాయ్ బూతాభాయ్ కుమారుడు విశాల్‌భాయ్​కు, రాఠోడ్ పెద్ద కుమార్తె హేతల్​కు వివాహం చేయాలని కొద్దిరోజుల క్రితం నిశ్చయించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం వారి పెళ్లి గురువారం జరగాల్సి ఉంది. దీంతో ఇరు కుటుంబాల్లో పెళ్లిసందడం నెలకొంది.

వివాహంలో భాగంగా.. వరుడు విశాల్​భాయ్​ కూడా నారీ గ్రామం నుచి పెళ్లి ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. ఇంతలోనే విధి మరొకటి తలిచింది.పెళ్లి జరగడానికి కొన్ని గంటల ముందు హేతల్​ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. హేతల్​ అప్పటికే మృతి చెందినట్లు అక్కడ వైద్యులు స్పష్టం చేశారు. వధువు మృతికి గుండెపోటు కారణమని తెలిపారు. పెళ్లి జరగాల్సిన రోజే వధువు మృతి చెందడం వల్ల ఇరు కుటుంబాల్లోనూ విషాదఛాయలు అలముకున్నాయి.

అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మృతురాలి కుటుంబం ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. నారీ గ్రామం నుంచి వచ్చిన పెళ్లి ఊరేగింపు తిరిగి వెళ్లకుండా ఉండేందుకు చనిపోయిన పెద్ద కుమార్తె స్థానంలో చిన్న కూతురును విశాల్​కు ఇచ్చి పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. దీనికి విశాల్​ కుటుంబం కూడా ఒప్పుకుంది. హేతల్​ మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచి.. చిన్న కుమార్తెను విశాల్​కు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ పెళ్లితో విశాల్​కు మరదలు కావాల్సిన అమ్మాయి.. భార్యగా మారింది.
రాఠోడ్​ కుమారుడి వివాహం శుక్రవారం జరగాల్సి ఉంది. అయితే.. ఈ బాధాకరమైన సంఘటనతో వధువు ఇంట్లో సందడి లేకుండా పోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.