బాలికను కత్తితో పొడిచి, రాయితో కొట్టి హత్య.. నడిరోడ్డుపైనే బాయ్​ఫ్రెండ్ దారుణం

author img

By

Published : May 29, 2023, 2:19 PM IST

Updated : May 29, 2023, 5:30 PM IST

boyfriend kills girlfriend delhi boy stabbed girl to death No One Stops Him

Boyfriend Kills Girlfriend Delhi : గర్ల్​ఫ్రెండ్​ను అత్యంత కిరాతకంగా చంపాడు ఓ యువకుడు. నడి వీధిలోనే ఆమెను కత్తితో పొడిచి, బండ రాయితో కొట్టి హత్య చేశాడు. దిల్లీలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Boyfriend Kills Girlfriend Delhi : 16 ఏళ్ల బాలికను ఆమె బాయ్​ఫ్రెండ్​ అత్యంత దారుణంగా హత్య చేశాడు. రోడ్డుపైనే ఆమెను కత్తితో అనేకసార్లు పొడిచి, బండరాయితో కొట్టి చంపాడు. దిల్లీ షాబాద్ ప్రాంతంలో ఆదివారం జరిగిందీ ఘోరం.
పోలీసులు సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన బాలిక.. షాబాద్ డెయిరీ ప్రాంతంలోని జేజే కాలనీ వాసి. 20 ఏళ్ల సాహిల్​, ఆమె కొంతకాలంగా రిలేషన్​షిప్​లో ఉన్నారు. అయితే శనివారం వీరిద్దరికీ ఏదో విషయంలో గొడవ జరిగింది. ఆదివారం ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా సాహిల్​ అడ్డగించాడు. బాలికను కత్తితో అనేకసార్లు పొడిచాడు. దగ్గర్లో ఉన్న బండరాయితో ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఫలితంగా ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

బాలికను కత్తితో పొడిచి, రాయితో కొట్టి హత్య.. నడిరోడ్డుపైనే బాయ్​ఫ్రెండ్ దారుణం

Delhi Girl Murdered By Boyfriend : నడి వీధిలో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఐపీసీ 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేశారు. బాలికను సాహిల్​ ఎన్నిసార్లు కత్తితో పొడిచాడో పోస్ట్​మార్టం పరీక్ష నివేదిక వచ్చాక తెలుస్తుందని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడు సాహిల్​ కోసం ఆరుబృందాలుగా ఏర్పడి అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు.

boyfriend kills girlfriend delhi boy stabbed girl to death No One Stops Him
నిందితుడు సాహిల్​

"షాబాద్ పోలీస్​స్టేషన్​ పరిధిలో 16 ఏళ్ల బాలికను ఆమె ప్రియుడు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత రాయితో దాడి చేసి చంపాడు. నిందితుడిని 20 ఏళ్ల సాహిల్‌గా గుర్తించాం. ఆదివారం.. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. మృతురాలు తన స్నేహితురాలి కుమారుడి పుట్టినరోజు వేడుకకు వెళ్తుండగా నిందితుడు ఆమెను అడ్డగించి హత్య చేశాడు" అని పోలీసులు తెలిపారు.

నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిందే!
16 ఏళ్ల బాలిక దారుణ హత్య ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. సాహిల్​ను ఎప్పుడూ చూడలేదని మృతురాలి తల్లి చెప్పింది. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ డిమాండ్​ చేసింది. "నా కుమార్తెను అనేక సార్లు కత్తితో పొడిచారు. ఆమె తలను కూడా ముక్కలు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము" అని బాధితురాలి తండ్రి వ్యాఖ్యానించారు.

ఎల్​జీ సర్‌.. దిల్లీలో శాంతిభద్రతల బాధ్యతే మీదే..: కేజ్రీవాల్‌
ఈ ఘటనపై కఠినంగా వ్యవహరించాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. నగరంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఎల్​జీదేనని ఆయన స్పష్టం చేశారు. "దిల్లీలో ఓ 16ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురయ్యింది. ఇది చాలా దురదృష్టకరం. నేరస్థులకు భయం లేకుండా పోయింది. పోలీసులంటే వారికి భయం లేదు. ఎల్జీ సర్‌, శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత మీదే. ఏదైనా చేయండి. దిల్లీ పౌరుల భద్రతే గవర్నర్‌ తొలి ప్రాధాన్యం కావాలి" అంటూ కేజ్రీవాల్‌.. ఎల్​జీని విజ్ఞప్తి చేశారు.

ఆప్‌ నేత, దిల్లీ మంత్రి అతిషీ కూడా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తీరుపై మండిపడ్డారు. "దిల్లీ ప్రజలను రక్షించే బాధ్యత రాజ్యాంగం కల్పించిందని లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు గుర్తు చేస్తున్నాను. కానీ ఆయన సమయం మొత్తం కేజ్రీవాల్‌ పనులను ఆటంకపరిచేందుకే కేటాయిస్తారు. దిల్లీ మహిళలకు రక్షణ కల్పించడంపై శద్ధ చూపాలని చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా" అని ఆమె ట్వీట్‌ చేశారు.

40-50 సార్లు పొడిచాడు!
Delhi Boy Killed Girlfriend : "16 ఏళ్ల బాలికను 40-50 సార్లు కత్తితో పొడిచాడు. అనేకసార్లు రాయితో కొట్టాడు. తర్వాత ఆమె చనిపోయింది. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ నేరాన్ని అప్పుడే అనేక మంది చూశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. బాలికలు, మహిళలకు దిల్లీ ఏమాత్రం సురక్షితం కాదు. తక్షణమే కేంద్ర హోంమంత్రి, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, దిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రితో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని నేను కేంద్రాన్ని కోరుతున్నా" అని దిల్లీ మహిళా కమిషన్​ చీఫ్​ స్వాతి మాలివాల్ అన్నారు.

ఈ దారుణ ఘటనపై వాయువ్య దిల్లీ బీజేపీ ఎంపీ హన్స్ రాజ్ హన్స్ స్పందించారు. "ఇది దురదృష్టకర ఘటన. గతంలో కూడా నా నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. పోలీసులతోపాటు బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాను" అని తెలిపారు.

Last Updated :May 29, 2023, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.