ETV Bharat / bharat

ఈనాడు 'అమృతగాథ' పుస్తకంపై ఝార్ఖండ్ సీఎం ప్రశంసలు

author img

By

Published : Dec 8, 2022, 11:03 AM IST

స్వాతంత్య్ర సమరయోధుల వీరోచిత గాథలతో ఈనాడు ప్రచురించిన 'ది ఇమ్మోర్టల్ సాగా - ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్' పుస్తకాన్ని రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు తరఫున ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్​కు సంస్థ ప్రతినిధులు అందజేశారు.

book-presented-to-cm-hemant-soren-on-behalf-of-ramoji-rao
ఈనాడు గ్రూప్ ఛైర్మన్ తరఫున ఝార్ఖండ్ సీఎంకు 'ది ఇమ్మోర్టల్ సగా' పుస్తకం అందిస్తున్న దృశ్యం

భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక కథనాలను.. తెలుగు పాఠకుల అభిమాన పత్రిక 'ఈనాడు' సంకలనం చేసింది. 'అమృతగాథ', 'ది ఇమ్మోర్టల్ సాగా - ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్' పేరిట తెలుగు, ఆంగ్ల భాషల్లో ఈ పుస్తకం ప్రచురించింది. మంగళవారం ఈ పుస్తకం కాపీని రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు తరఫున రాజేష్ కుమార్ సింగ్.. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్​కు రాంచీలో అందజేశారు. ఝార్ఖండ్​కు చెందిన ఉద్యమ వీరులు భగవాన్ బిర్సా ముండా, శ్రీ జైపాల్ సింగ్ ముండా చేసిన పోరాటాన్ని వివరిస్తూ.. ది స్టోరీ ఆఫ్ ప్రౌడ్ ట్రైబల్ అండ్ బిర్సా ముండా- ది 'గాడ్ ఆన్ ది ఎర్త్​' అనే కథనాన్ని ఈ పుస్తకంలో ప్రచురించినట్లు వివరించారు.

ఈ పుస్తకాన్ని అందుకున్న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి, ఈనాడు గ్రూప్​ను ప్రశంసించారు. "బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఎవరూ గొంతు విప్పని సమయంలో చాలా మంది వీరులు ఝార్ఖండ్​ గడ్డపై పోరాడారు. అమర్ షహీద్ తిల్కా మాంఝీ, సిద్ధో-కాన్హో, వీర్ బుధు భగత్, భగవాన్ బిర్సా ముండా వంటి వీరుల పోరాటాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ.. వారిని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది" అని ఆయన అన్నారు.

దేశమంతా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటున్న సమయంలో ఈనాడు గ్రూప్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది రోజుల క్రితం ఈ పుస్తకం ఆవిష్కరించారు. ఈనాడు గ్రూప్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రధాని మోదీ.. రామోజీ గ్రూప్ ఛైర్మన్​ను కొనియాడారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.