ETV Bharat / bharat

Narayan Rane news: 'ఇకపై మంచి పదాలతో విమర్శిస్తా..'

author img

By

Published : Aug 25, 2021, 4:48 PM IST

Updated : Aug 25, 2021, 7:38 PM IST

మహారాష్ట్ర ప్రభుత్వంపై నారాయణ్​ రాణె మండిపడ్డారు. తాను తప్పుచేయలేదని, ఎవరికి భయపడనని తేల్చిచెప్పారు. సీఎం ఠాక్రే.. గతంలో అమిత్​ షాపై పరుషపదజాలాన్ని ఉపయోగించారని గుర్తుచేశారు.

Narayan Rane
నారాయణ రాణె

మహారాష్ట్ర ప్రభుత్వం, సీఎం ఉద్ధవ్​ ఠాక్రేపై కేంద్రమంత్రి నారాయణ్​ రాణె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, యోగి ఆదిత్యనాథ్​లను ఠాక్రే కూడా పరుషపదజాలంతో దూషించినట్లు రాణె ఆరోపించారు. ఠాక్రే సర్కారు తనపై ఎన్ని కేలు పెట్టిన భయపడే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.
దేశానికి స్వాతంత్ర్యం ఏ ఏడాది వచ్చిందో తెలియని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను చెంపదెబ్బ కొట్టేవాడినని రాణె వ్యాఖ్యనించగా.. ఆయన్ని పోలీసులు మంగళవారం అరెస్ట్​ చేశారు. అదే రోజు రాత్రి ఆయనకు బెయిల్​ లభించింది. అరెస్ట్​ అయిన ఒక రోజు అనంతరం మీడియా ముందుకొచ్చారు రాణె.

"నేను ఎవరికీ భయపడను, వెనకడుకు వేయను కూడా. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాదిని మర్చిపోయిన ముఖ్యమంత్రిపై నేను ఆగ్రహం వ్యక్తం చేశాను. ఆయన చెప్పిన మాటలనే నేను తిరిగి మీడియాకు చెప్పాను. అది ఎలా నేరం అవుతుంది? ఇకపై మంచి పదాలు ఉపయోగించి విమర్శలు చేస్తాను. మహారాష్ట్రను మరో బంగాల్​ కానివ్వను."

- నారాయణ్​ రాణె, కేంద్ర మంత్రి

శివసేన పార్టీ కార్యాలయంపై దాడి చేసే వారి చెంప చెళ్లుమనిపించాలని సీఎం ఉద్ధవ్​ ఠాక్రే ఆదేశించినట్లు రాణె ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని తాను తెలిగ్గా తీసుకోనని, రానున్న రోజుల్లో న్యాయపరమైన అంశాలతో.. మహావికాస్​ అగాఢీ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడతానని హెచ్చరించారు రాణె.

'రాణెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు'

అంతకుముందు.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను(Uddhav Thackeray) ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ్‌ రాణె(Narayan Rane news)పై ఎలాంటి చర్యలు చేపట్టకూడదని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నాసిక్​ పోలీసులకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్​ 17కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

తనపై నమోదైన ఎఫ్​ఐఆర్​ల​ను కొట్టేయాలని కోరుతూ బాంబే హైకోర్టు(Bombay High Court)ను కేంద్ర మంత్రి రాణె ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నోటీసులు ఇవ్వకుండా తనను పోలీసులు ఎలా అరెస్టు చేస్తారని నారాయణ్​ రాణె తన పిటిషన్​లో పేర్కొన్నారు.

'ఆ చర్యలు తీసుకోము..'

మరోవైపు కేంద్ర మంత్రి నారాయణ్ రాణేపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని బాంబే హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు జస్టిస్​ ఎస్​ఎస్​ షిండే నేతృత్వంలోని ధర్మాసనానికి ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చూడండి: ఎంట్రీ సాంగ్ నచ్చలేదని.. పెళ్లి కూతురు ఏం చేసిందంటే?

Last Updated : Aug 25, 2021, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.